Siddharth: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి తెలుగు ప్రజలకు అస్సలు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. బాయ్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు సిద్దార్థ్. ఇక సిద్దు సినిమాల గురించి పక్కన పెడితే.. ఆయన వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ఎఫైర్స్ తో ఫేమస్ అయ్యాడని చెప్పొచ్చు. గతంలో సమంత రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ గా పేరు తెచ్చుకొని మంచి హల్చల్ చేశాడు. ఆ తరువాత సామ్ విడాకుల తరువాత వివాదాస్పద ట్వీట్ చేసి మరింత అగ్గి రాజేశాడు. ఇక రాజీకయపరంగా సిద్దు చేసే వివాదాస్పద వ్యాఖ్యల గురించి అసలు చెప్పనే అవసరం లేదు. ఇక ప్రస్తుతం సిద్దు.. స్టార్ హీరోయిన్ అదితి రావు హైదరితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే. వారి మధ్య ఉన్న బంధాన్ని వారే అధికారికంగా ప్రకటించారు కానీ, పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు. పెళ్లి కాకుండానే ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారట. అదితి, సిద్దార్థ్ కలిసి మహా సముద్రం సినిమాలో నటించారు. అదే సినిమాలో శర్వానంద్ హీరోగా నటించాడు.
నేడు శర్వా ఎంగేజ్ మెంట్ జరుగగా.. ఈ జంట ఆ వేడుకకు హాజరయ్యి హాట్ టాపిక్ గా మారారు. పెళ్లి కాకముందే జంటగా ఫంక్షన్స్ కు తిరిగేస్తున్నారు. మరి ఇంతలా చేయాలా..? పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా.. అని అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు. ఇక మరికొంతమంది పెళ్లితో వారికీ పనేముంది లే.. ఎన్నిరోజులు ఉంటారో వారికే తెలియదు అని చెప్పుకొస్తున్నారు. ఎవరు ఏమన్నా తమకు నచ్చిన పద్దతిలో వారు ఉండాలనుకుంటున్నారు అనేది మాత్రం క్లారిటీగా తెలుస్తోంది. హీరోయిన్ తో ఎఫైర్ బట్టబయలే.. కానీ, పెళ్లి తరువాత ఇలా జంటగా వస్తే బావుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వీరిద్దరూ సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారేమో.. ఎవరికి తెలుస్.. ఇలాంటివి వారికి కామన్ వదిలేయండి అని ఇంకొందరు అంటున్నారు.