Chinna : ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతున్న సిద్దార్థ్ చిన్నా మూవీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎట్టకేలకు హీరో సిద్దార్థ్ తెలుగులో చిన్నా సినిమాతో మంచి విజయం సాధించాడు.. ఈ మూవీ రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది.అక్టోబర్ 6న టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్నా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని నిర్మించింది హీరో సిద్ధార్థ్ కావడం గమనార్హం . ఈ మూవీ కి ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. అరుణ్ కుమార్.. చైల్డ్ అబ్యూజింగ్, హరాస్మెంట్ వంటి సున్నితమైన అంశాలను డీల్ చేసిన విధానం ఎంతో బాగుంది. ఇందులో నటీనటులు అద్భుతంగా నటించారు.ఈ చిత్రంలో నిమిషా విజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన చిన్నా మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. ఈ నెల చివరి వారం లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతున్నట్లు సమాచారం.. త్వరలో స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించే అవకాశం కూడా ఉంది.
చిన్నా సినిమాకు విశాల్ చంద్రశేఖర్, దిబు నినన్ థామస్, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.. గతంలో టాలీవుడ్ లో సిద్ధార్ధ్ కు లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాతో ఫ్యామిలి ఆడియెన్స్ తో పాటు యూత్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు సిద్ధార్థ్. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ మరియు లవ్ ఫెయిల్యుర్ వంటి సినిమాలు సిద్దార్థ్ కు తెలుగులో మంచి గుర్తింపునిచ్చాయి. రీసెంట్ గా ఈయన నటించిన మహాసముద్రం, టక్కర్ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.అయితే చిన్నా సినిమా సిద్దార్థ్ కు మంచి ఊరటను ఇచ్చింది..సిద్దార్థ్ కు ఈ సినిమా మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పాలి.. చాలా కాలం తరువాత తెలుగులో హిట్ అందుకోవడంతో సిద్దార్థ్ ఎంతో సంతోషంగా వున్నాడు
Also Read
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
తాజావార్తలు
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!