NTV Telugu Site icon

Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. డిప్యూటీగా డీకే శివకుమార్‌.. రేపే ప్రమాణం!

Siddaramaiah

Siddaramaiah

Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిపై గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ముఖ్యమంత్రి పదవికోసం సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనే అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సీనియారిటికే పార్టీ హైకమాండ్ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యేలు సైతం ఆయనకే మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై సిద్ధరామయ్యతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా.. సాయంత్రంలోపే మల్లిఖార్జున ఖర్గే ఓ ప్రకటన చేస్తారని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రేపే సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మరోవైపు లింగాయత్, ముస్లింతో పాటు దళిత వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నారని తెలుస్తోంది.

పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ మంగళవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలోనే సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటిద్దామని వారు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతో రాహుల్‌ గాంధీ విడివిడిగా భేటీ అయ్యారు. తొలుత సిద్ధరామయ్య భేటీ అనంతరం, శివకుమార్ రాహుల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో శివకుమార్‌ను రాహుల్ బుజ్జగించినట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్‌కు కేపీసీసీ అధ్యక్ష పదవితో పాటు ఉపముఖ్యమంత్రి, కీలక మంత్రిత్వ శాఖలు అందించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంతకు ముందు పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని డీకే శివకుమార్‌ అన్న సంగతి తెలిసిందే. రేపు లంచ్ తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. సిద్ధరామయ్య ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. అలాగే, రేపు గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు కంఠీరవ స్టేడియంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది.

Read Also: Theif : దేవుడు కలలో చెప్పాడు.. అందుకే తీసిన నగలు ఇచ్చేస్తున్నాను

సిద్ధరామయ్యకు సీఎం పదవి అప్పగించేందుకు పలు కారణాలు ఉన్నాయి. అధిక మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రధాన కారణం. 135 ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో 90మంది ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకే ఉన్నట్లు అధిష్టానం నిర్వహించిన రహస్య ఓటింగ్‌లో స్పష్టమైనట్లు తెలిసింది. అంతేకాక ఓబీసీ వర్గాల్లో సిద్ధరామయ్యకు మంచి ఇమేజ్ ఉంది. ఆయన 2013 నుంచి 2018 వరకు కర్ణాటక సీఎంగా పనిచేశారు. ఆ సమయంలో అవినీతి రహిత పాలన సాగించారన్న పేరుంది. మాస్ లీడర్ గానూ సిద్దరామయ్యకు పేరుంది. అంతేకాక, సిద్ధరామయ్య అయితే రాబోయే కాలంలో పార్టీలో వర్గవిబేధాలు లేకుండా సాఫీగా పాలన సాగిస్తారని అధిష్టానం భావించింది. ఈ క్రమంలోనే మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైంది.