NTV Telugu Site icon

Karnataka: ఓ కేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు బెయిల్

Kd

Kd

పరువు నష్టం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు బెయిల్‌ లభించింది. ప్రజా ప్రతినిధుల కోర్టులో ఇద్దరికి ఊరట లభించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి కేశవ ప్రసాద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి వీళ్లిద్దరికి ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకి రాహుల్ గాంధీ లేఖ.. ఎందుకంటే..?

గత బీజేపీ ‍ప్రభుత్వం అన్నీ పనుల్లో 40 శాతం కమీషన్‌ వసూలు చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పేపర్‌లలో ప్రకటనలు ఇచ్చింది. వివిధ పనుల కోసం గత సర్కార్‌ అవినీతి రేటు కార్డులు నిర్ణయించిందంటూ ఆరోపిస్తూ పోస్టర్లను కూడా ముద్రించింది. అయితే అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని బీజేపీ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు సిద్ధరామయ్య, శివకుమార్‌తో పాటు రాహుల్‌ గాంధీలపై బీజేపీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి కేశవ్‌ ప్రసాద్‌ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. శనివారం విచారణ సందర్భంగా సిద్ధరామయ్య, శివకుమార్ 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. అనంతరం సిద్ధరామయ్య,, శివకుమార్‌లకు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Somnath Bharti : మూడోసారి మోడీ ప్రధాని అయితే గుండు కొట్టుకుంటా : ఆప్ ఎంపీ అభ్యర్థి సోమనాథ్