NTV Telugu Site icon

Shubhman Gill: సచిన్ చూస్తుండగా గిల్ సెంచరీ.. వైరల్ అవుతోన్న మీమ్స్

Sav

Sav

టీమిండియాలో ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ హవా నడుస్తోంది. ఇటీవలే న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీతో దుమ్మురేపిన గిల్..బుధవారం అదే జట్టుపై టీ20ల్లోనూ సెంచరీ చేశాడు. ఈ ఫార్మాట్‌లో ఇదే అతడికి తొలి శతకం కావడం విశేషం. అలాగే మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన ఐదో టీమిండియా ప్లేయర్‌గా ఘనత సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌ అతడి కెరీర్‌లో ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ఎందుకుంటే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సమక్షంలో ఈ మ్యాచ్ జరగడం..అందులో గిల్ సెంచరీ చేయడం. ఈ క్రమంలోనే గిల్ ఇన్నింగ్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన సచిన్‌ అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. అద్భుత ఇన్నింగ్స్ అంటూ కొనియాడాడు. ఈ నేపథ్యంలోనే పలువురు ఫ్యాన్స్ నెట్టింట హంగామా చేస్తున్నారు. “గిల్‌ మ్యాచ్‌ ఆడుతున్నాడంటే.. బీసీసీఐ సచిన్‌ను కచ్చితంగా ప్రతి మ్యాచ్‌కు తీసుకురావాల్సిందే! దేవుడి సమక్షంలో భక్తుడి అద్భుత ఇన్నింగ్స్‌.. నిజంగా ఇది సూపర్‌! అసలైతే టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత సచిన్‌తో గిల్‌కు సన్మానం చేయిస్తే ఇంకా బాగుండేది కదా!” అని ఫ్యాన్స్‌ సరదాగా ట్రోల్‌ చేస్తున్నారు.

కొందరు మరో అడుగు ముందుకేసి.. మామ ముందు అల్లుడు సెంచరీ కొట్టాడంటూ మీమ్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు. కాగా అహ్మదాబాద్‌ మ్యాచ్‌ సందర్భంగా సచిన్‌ చేతుల మీదుగా అండర్‌ 19 మహిళా ప్రపంచకప్‌ విజేత అయిన భారత జట్టుకు సన్మానం జరిగింది. ఇదిలా ఉంటే.. సచిన్‌ కూతురు సారాతో గిల్‌ ప్రేమలో ఉన్నాడంటూ గతంలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గిల్‌ అత్యుత్తమంగా రాణించినప్పుడల్లా అతడి పేరును సారా, సచిన్‌తో ముడిపెడుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడూ అదే జరిగింది.

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌లో దుమ్మురేపిన భారత్‌.. బౌలింగ్‌లో అదరగొట్టడంతో 168 రన్స్ భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీ20ల్లో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 234/4 రన్స్ చేసింది. యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 63 బంతుల్లో 126* రన్స్ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. రాహుల్ త్రిపాఠి (44), హార్దిక్ పాండ్యా (30) రాణించారు. అనంతరం 235 రన్స్ భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్‌ 12.1 ఓవర్లలో 66 రన్స్‌ చేసి ఆలౌటైంది.