Site icon NTV Telugu

Shubman Gill Injury: ఐసీయూలో టీమిండియా కెప్టెన్ గిల్..! ఇంతకీ ఏం జరిగింది..?

Gill

Gill

Shubman Gill Injury: భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతోంది. మ్యాచ్‌లో రెండవ రోజు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేస్తూ.. మెడ నొప్పితో వెనుదిరిగాడు. నాలుగు పరుగులు చేసిన గిల్ గాయంతో మైదానం రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిపోయాడు. దీంతో భారత తొలి ఇన్నింగ్స్ 189 పరుగుల వద్ద ముగిసింది. అయితే.. గిల్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా కీలక సమాచారం వెలువడింది. గిల్‌ను స్ట్రెచర్‌పై వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రికి తరలించారు. పలు నివేదికల ప్రకారం.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)కి తరలించినట్లు తెలుస్తోంది. స్కాన్‌లు, MRIలు చేశారు. మెడ చుట్టూ, లోపల నొప్పి కారణంగా ICUకి తరలించినట్లు సమాచారం. దీంతో శుభ్‌మాన్ గిల్ తాజాగా జరుగుతున్న కోల్‌కతా టెస్ట్‌లోని మిగిలిన మ్యాచ్‌లు ఆడటం అసంభవమని తెలుస్తోంది.

READ MORE: Kavitha: కేసీఆర్ మళ్లీ పిలిస్తే బీఆర్ఎస్‌లోకి వెళ్తారా..? కవిత సమాధానం ఇదే..

నిజానికి.. కోల్‌కతా టెస్ట్‌లో రెండవ రోజు(శనివారం) శుభ్‌మాన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సైమన్ హార్మర్ వేసిన స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా మెడ నొప్పితో బాధపడ్డాడు. ఓ ఫిజియోథెరపిస్ట్‌ను మైదానంలోకి పిలిపించారు. పరీక్షించిన తరువాత గిల్ ఫిజియోథెరపిస్ట్‌తో కలిసి మైదానం నుంచి వెళ్లిపోయాడు. నొప్పి కారణంగా అతను తన మెడను కదపలేకపోయాడు. జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో చికిత్స చేయడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ.. నొప్పి నుంచి ఉపశమనం లభించలేదు. దీంతో మ్యాచ్ అనంతరం స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. “ప్రస్తుతం గిల్ మెడ బిగుసుకుపోయింది. ఇది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. నిన్న రాత్రి గిల్ సరిగ్గా నిద్ర పోలేదు. అందువల్ల ఇలా జరిగి ఉండవచ్చు..” అని భారత్ బౌలింగ్ కోచ్‌ మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు.

Exit mobile version