Site icon NTV Telugu

Shubman Gill: వాళ్ల వల్లనే సెలక్ట్ కాలేదు: శుభ్‌మన్ గిల్

Shubman Gill Press Conference

Shubman Gill Press Conference

Shubman Gill: 2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో చోటు దక్కకపోవడంపై భారత క్రికెట్ టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఫస్ట్ టైం స్పందించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు జరిగిన ప్రీ-ప్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెలెక్టర్ల నిర్ణయాన్ని తాను పూర్తిగా గౌరవిస్తున్నానని, ఈ టోర్నమెంట్‌లో జట్టు విజయాన్ని కోరుకుంటున్నానని విలేకరులతో అన్నారు. నిజానికి గిల్ ఈ ఫార్మెట్‌లో కొంతకాలం వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కానీ పేలవమైన ప్రదర్శన ఆయన టీంలో తన స్థానాన్ని కోల్పోవలసి వచ్చింది.

READ ALSO: MSVG : రివ్యూ – రేటింగ్స్ ఇవ్వడానికి వీల్లేదు.. కోర్టు సంచలన తీర్పు

శుభ్‌మాన్ గిల్ మాట్లాడుతూ.. “సెలెక్టర్ల నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. టీ20 ప్రపంచ కప్ కోసం ఎంపికైన జట్టుకు శుభాకాంక్షలు” చెప్పారు. అలాగే ఆయన మాట్లాడుతూ..”నేను ఉండాల్సిన స్థానంలోనే ఉన్నాను. నా విధిలో రాసి ఉన్నదాన్ని ఎవరూ తీసివేయలేరు. ఒక ఆటగాడు ఎల్లప్పుడూ దేశం కోసం తన వంతు కృషి చేయాలని కోరుకుంటాడు. సెలెక్టర్లు కూడా తమ పనిని సక్రమంగా చేశారు” అని అన్నారు.

గిల్ కు T20 ఫార్మాట్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి, కానీ ఆయన ఇటీవల ప్రదర్శనలు చూస్తే పరుగులు సాధించడంలో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన స్వదేశీ T20 సిరీస్‌లో గిల్ ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. ఈ టోర్నీలో మనోడు కేవలం 4, 4, 0, 28 మాత్రమే చేశాడు. ఇంకా 2025 లో T20 అంతర్జాతీయ మ్యాచ్ లలో కూడా ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. ఏడాది పొడవునా ఆయన 15 T20I లు ఆడి, 24.25 సగటుతో కేవలం 219 పరుగులు మాత్రమే చేశాడు.

గిల్ తొలగింపుపై చీఫ్ సెలెక్టర్ రియాక్షన్..
2026 టీ20 ప్రపంచ కప్ కోసం జట్టు ప్రకటన తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ శుభ్‌మాన్ గిల్‌ను తప్పించడానికి గల కారణాన్ని వెల్లడించారు. గిల్ ఇటీవల ఫామ్ లేమితో ఇబ్బంది పడటంతో తనకు జట్టులో చోటుదక్కలేదని అన్నారు. ఈ సందర్భంగా అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. “అతను ఎంత నాణ్యమైన ఆటగాడో మాకు తెలుసు, కానీ ప్రస్తుతానికి అతను పరుగుల కోసం కష్టపడుతున్నాడు. అలాగే మీరు 15 మందిని ఎంచుకున్నప్పుడు, ఎవరో ఒకరిని కోల్పోవాలి, ఈసారి దురదృష్టవశాత్తు అది గిల్ అయ్యాడు” అని వివరించాడు.

READ ALSO: Ayodhya Ram Temple: అయోధ్య రామాలయంలో నమాజ్.. తర్వాత ఏం జరిగిందంటే !

Exit mobile version