NTV Telugu Site icon

Shubman Gill: టీమిండియా యంగ్‌ ప్లేయర్ గిల్‌కు ఐసీసీ అవార్డు

11

11

టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్‌మన్‌ గిల్‌ అంతర్జాతీయ క్రికెట్ మండలి అవార్డు అందుకున్నాడు. జనవరి నెలకు గానూ ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ (జనవరి 2023)గా ఎంపికయ్యాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న గిల్‌ జనవరిలో పరుగుల వరద పారించాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో అదరగొట్టాడు. శ్రీలంక, న్యూజిలాండ్‌ సిరీస్‌ల్లో కలిపి 567 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌పై 208 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతను ఇంకో రెండు శతకాలు కూడా బాదాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం గిల్‌తో పాటు సిరాజ్, డెవోన్ కాన్వే పోటీ పడ్డారు. గతేడాది అక్టోబర్‌లో విరాట్ కోహ్లీ తర్వాత ఈ అవార్డు అందుకున్న ఇండియన్ ప్లేయర్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఇంగ్లాండ్‌కు చెందిన గ్రేస్‌ స్క్రీవెన్స్‌.. మహిళల విభాగంలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’గా ఎంపికైంది.

Also Read: Supreme Hero: ప్రేమలో పడమంటే… మత్తులో పడ్డావా రాజా?

తనకు ఈ అవార్డు దక్కడంపై గిల్ స్పందించాడు. “ఐసీసీ ప్యానెల్, క్రికెట్ అభిమానులకు నాకు ఓటేసి ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. జనవరి నాకు ప్రత్యేకమైన నెల. ఈ అవార్డు దానిని మరింత స్పెషల్‌గా మార్చేసింది. ఈ సక్సెస్‌కు కారణమైన టీమ్ మేట్స్, కోచ్‌లకు రుణపడి ఉంటాను. వన్డే వరల్డ్ కప్ రానున్న నేపథ్యంలో ఈ అవార్డు నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది” అని గిల్ అన్నాడు.

Also Read: Sri Vishnu: బాలయ్య, అల్లు అర్జున్ ఫాన్స్ బాగా కనెక్ట్ అయ్యే టైటిల్…