సౌత్ లో బిజీగా ఉన్న క్రేజీ హీరోయిన్లలో ఒకరు శృతి హాసన్ ఒకరు.. ప్రస్తుతం పాన్ వరల్డ్ నటిగా మారారు. నటి, సంగీత దర్శకురాలు, గాయనిగా పేరు తెచ్చుకున్న బ్యూటి శృతి హాసన్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ వస్తుంది..ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం అమ్మడుకు అలవాటు.. విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది..
ఇక శ్రుతిహాసన్ హీరోయిన్ గా సినిమాలు చేయడం మాత్రమే కాదు సింగర్ గా పాటలు పాడుతుంది.. మ్యూజిక్ డైరెక్టర్ గా సంగీతం కూడా అందిస్తుంది. మ్యూజిక్ కూడా ప్రొఫెషనల్ గా తీసుకొని ఈవెంట్స్, స్టేజి షోలు, ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తుంది శ్రుతిహాసన్.. ఇప్పటికే పలు మ్యూజిక్ ప్రైవేట్ ఆల్బమ్స్, స్టేజి షోలతో మెప్పించింది శ్రుతిహాసన్. రెగ్యులర్ గా తన మ్యూజిక్ అప్డేట్స్ గురించి కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. ఆ వీడియోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చెప్పనక్కర్లేదు..
తాజాగా శ్రుతిహాసన్ GQMOTY అనే ఈవెంట్ లో తన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన లైవ్ పర్ఫార్మెన్స్ తో అక్కడున్న వారందర్ని ఇంప్రెస్ చేసింది.. శృతిహాసన్ తాజాగా ఓ ఈవెంట్ లో పాట పాడింది.. ఇందులో శ్రుతిహాసన్ ఓ ఇంగ్లీష్ సాంగ్ ని పాడుతుంది. హాలీవుడ్ స్టార్ సింగర్స్ ని తలదన్నేలా శ్రుతిహాసన్ స్టేజిపై రెచ్చిపోయింది తన పర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకుంది.. ఆ పాట చాలా అద్భుతంగా ఉంది.. హాలివుడ్ సింగర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.. ఈ అమ్మడు పాడిన పాటకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఇకపోతే ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న భామ.. ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రం సలార్‌లో కనపించనున్నారు. అదేవిధంగా తొలిసారిగా ది ఐ అనే హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. దీని గురించి ఆమె తెలుపుతూ భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమని తెలిపారు. అయితే పెద్ద, చిన్న చిత్రాలు అని చూడనని.. ప్రేక్షకులకు మంచి కథా చిత్రాలను అందించడమే ముఖ్యమని పేర్కొన్నారు. అదే విధంగా తాను తమిళ అమ్మాయినని ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటిస్తానని చెప్పారు.. త్వరలోనే ఓ ఆల్బమ్ ను కూడా విడుదల చెయ్యనున్నట్లు తెలిపింది..
#ShrutiHaasan rocks out & the crowd goes wild at #GQMOTY2023#GQMOTY #GQIndia pic.twitter.com/YsbSnwfl4C
— GQ India (@gqindia) November 23, 2023