Site icon NTV Telugu

Shruti Haasan : అరుదైన జబ్బుతో పోరాడిన చిన్నారి ప్రాణాలు కాపాడిన శృతి హాసన్

Sruthihasson

Sruthihasson

మనం వెండితెరపై చూసే స్టార్లు నిజ జీవితంలో ఎలా ఉంటారో అని అందరికీ ఆసక్తి ఉంటుంది. కొందరు గ్లామర్‌కే పరిమితమైతే, మరికొందరు తమకున్న స్టార్‌డమ్‌ని తోటివారికి సాయం చేయడానికి వాడుతుంటారు. ఆ కోవలోకే వస్తుంది టాలెంటెడ్ బ్యూటీ శృతి హాసన్. తాజాగా ఒక అరుదైన జబ్బుతో చావుబతుకుల్లో ఉన్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడి, ఆ కుటుంబానికి దేవుడిలా అండగా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

Also Read : Ramayana : రణబీర్‌లో రాముడినే చూస్తారు – అరుణ్ గోవిల్ సెన్సేషనల్ కామెంట్స్!

‘ఆళ్వి’ అనే చిన్నారికి పుట్టుకతోనే MSMD అనే చాలా అరుదైన జన్యు సంబంధిత వ్యాధి వచ్చింది. పాపం ఆ పసిపాప పుట్టినప్పటి నుంచీ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అయితే 2025లో ఆ చిన్నారికి ఎముక మజ్జ మార్పిడి (Bone Marrow Transplant) చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ క్లిష్ట సమయంలో శృతి హాసన్ ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. పాప పరిస్థితి సీరియస్ అయ్యి ఐసీయూలో ఉన్నప్పుడు, శృతి హాసన్ ఊరికే డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోలేదు. స్వయంగా రంగంలోకి దిగి, బెస్ట్ డాక్టర్లతో మాట్లాడి పాపకు మెరుగైన వైద్యం అందేలా చూసింది. డాక్టర్ ధరణి, డాక్టర్ దివ్య వంటి నిపుణులను ఆ ఫ్యామిలీకి పరిచయం చేసి, ఆ పాప ప్రాణాలు దక్కేలా చేసింది. వైద్యంతో పాటు ఆర్థికంగా, మానసికంగా కూడా ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చింది.

ఇటీవల ఆ చిన్నారి ఆళ్వి తన పేరెంట్స్‌తో కలిసి శృతిని కలిసింది. ఆ సమయంలో శృతి ఆ పాపతో ఆడుకుంటున్న వీడియో చూస్తుంటే ఎవరికైనా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. “మా పాప ఈరోజు బతికి ఉందంటే అది కేవలం శృతి గారి వల్లే” అంటూ ఆ తల్లిదండ్రులు ఎమోషనల్ అయ్యారు. శృతి ఆ పాప కోసం ఒక పెద్ద బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి ఇస్తూ, తన సొంత ఇంటి మనిషిలా ఆదరించిందట.

 

Exit mobile version