Site icon NTV Telugu

Shriya Saran :ఓర్నీ.. పబ్లిక్ లో కాలు పైకెత్తి ఆ పోజులేంటి శ్రియా?

Shria Saran

Shria Saran

శ్రియ శరన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు టాలివుడ్ లో వరుస హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సరసన నటించింది.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో హీట్ పెంచుతుంది.. హాట్ హాట్ డ్రెస్సులో ఘాటు పోజులతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు విదేశాల్లో విహరిస్తున్న శ్రియ శరన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోమ్ నగరంలోని ప్రఖ్యాత కొలోజియం ఎదుట క్రేజీ పోజులతో శ్రియ మనసులు దోచేశారు..

హీరోయిన్ శ్రియ శరన్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. అటు ప్రొఫెషన్ ఇటు పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా ఆమె రోమ్ నగరంలో ఉన్నారు. కొలోజియం దగ్గర ఫోటో షూట్ చేశారు.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శ్రియ పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. టాలీవుడ్ ఆమెను స్టార్ చేసింది. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రియ శరన్ నటి కావాలని కలలు కన్నారు. అందుకు డాన్స్, యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నారు. ముంబైలో రామ్ చరణ్, శ్రియ ఒకే ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్నారని ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి..

ఇష్టం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన శ్రీయకు ఆ సినిమా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేక పోయింది.. ఆమెకు బ్రేక్ ఇచ్చిన మూవీ సంతోషం. నాగార్జున హీరోగా తెరకెక్కిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టింది. ఆ వెంటనే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి మూవీలో శ్రియ నటించారు.ఆ సినిమా కూడా భారీ హిట్ ను అందుకుంది.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ అయ్యారు. టాప్ స్టార్స్ అందరితో నటించారు. శ్రియ తన కెరీర్లో అనేక ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది..ఇటీవల మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ ఆర్ట్ ఫిల్మ్ అంతగా ఆదరణ పొందలేదు. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కబ్జ మూవీలో లీడ్ హీరోయిన్ గా చేసింది.. అలాగే సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తుంది. నాలుగు పదుల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు పోటీని ఇస్తూ మరింత అందంగా తయారవుతుంది.. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులలో నటిస్తుంది..

 

Exit mobile version