R.Thyagarajan: నిజంగా నువ్వు ‘త్యాగ’రాజువే… రూ.6200కోట్లు పంచిపెట్టావంటే మామూలు విషయం కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R.Thyagarajan: ఇప్పటి వరకు దానం చేసిన వారిలో గొప్ప వ్యక్తి ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కర్ణుడు. ఆయన ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే వారు. ప్రస్తుత కాలంలో కూడా అలాంటి వ్యక్తి ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. కానీ నిజంగానే ఉన్నారు. ఆయనే శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆర్ త్యాగరాజన్. పేరులోనే త్యాగాన్ని పెట్టుకుని అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే మంచి మనసు తనది. తనకు ఉన్న చిన్న ఇల్లు, కారు తప్ప మిగతా ఆస్తులన్నింటినీ విరాళంగా ఇచ్చారు. 86 ఏళ్ల త్యాగరాజన్ ఒక ఇంటర్వ్యూలో.. ‘నేను 750 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 6210 కోట్లు) విరాళంగా ఇచ్చానని చెప్పాడు. అయితే ఈ విరాళం ఎప్పుడు ఇచ్చారనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. త్యాగరాజన్ తన మొత్తం వాటాను తన దగ్గర పనిచేసే ఉద్యోగుల బృందానికి పంచాడు. మొత్తం డబ్బును శ్రీరామ్ యాజమాన్య ట్రస్టుకు బదిలీ చేశాడు.
1974లో శ్రీరామ్ గ్రూప్ స్థాపన
శ్రీరామ్ గ్రూప్‌ను 5 ఏప్రిల్ 1974న చెన్నైలో ఆర్ త్యాగరాజన్, ఏవీఎస్ రాజా, టీ.జయరామన్ స్థాపించారు. చిట్ ఫండ్ వ్యాపారంతో ప్రారంభమైన ఈ గ్రూపు తర్వాత రుణం, బీమా వ్యాపారంలోకి ప్రవేశించింది. బ్యాంకుల నుంచి రుణాలు పొందని అల్పాదాయ ప్రజలకు రుణాలు ఇప్పించి త్యాగరాజన్ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.
Also Read
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
1,08,000 మంది ఉద్యోగులు
శ్రీరామ్ గ్రూప్‌లో 1,08,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సమాజంలోని పేద వర్గాలకు ట్రక్కులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల కోసం రుణాలు అందించడంలో ఈ సంస్థ అగ్రగామిగా ఉంది. క్రెడిట్ హిస్టరీ లేని వ్యక్తులకు రుణం ఇవ్వడం ప్రమాదకరం కాదని నిరూపించేందుకే తాను కంపెనీని ప్రారంభించానని త్యాగరాజన్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఫ్లాగ్షిప్ కంపెనీ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ విలువ దాదాపు 8.5 బిలియన్ డాలర్లు. జూన్ త్రైమాసికంలో దాని లాభం దాదాపు 200 మిలియన్ డాలర్లు.
Read Also:TTD Chairman: తిరుమలలో సామాన్య భక్తుడే నా మొదటి ప్రాధాన్యత
పేదలకు రుణాలు ఇవ్వడం ఒక విధమైన సోషలిజం
ఆర్ త్యాగరాజన్ మాట్లాడుతూ.. ‘నేను కొంచెం వామపక్షవాదినే, అయితే సమస్యలలో చిక్కుకున్న వారి జీవితాల నుండి చెడును తొలగించాలనుకుంటున్నాను. దీనితో పాటు క్రెడిట్ చరిత్ర, ఎక్కువ మొత్తంలో సంపాదన లేని వ్యక్తులకు రుణాలు ఇవ్వడం ప్రమాదకరం కాదని నిరూపించడానికి నేను ఫైనాన్స్ పరిశ్రమకు వచ్చాను. పేదలకు రుణాలు ఇవ్వడం ఒక సోషలిజమే. ప్రజలకు అందుబాటు ధరల్లో రుణాలు ఇచ్చేందుకు ప్రయత్నించాం.’ అని ఆర్ త్యాగరాజన్ అన్నారు.
తమిళనాడు రైతు కుటుంబంలో జననం
ఆర్ త్యాగరాజన్ తమిళనాడులోని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అతను మ్యాథ్య్స్లో గ్రాడ్యుయేషన్ చేశారు. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుండి మాస్టర్స్ డిగ్రీని పొందాడు. 1961లో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో చేరారు. రెండు దశాబ్దాలుగా పలు ఫైనాన్స్ కంపెనీల్లో ఉద్యోగిగా పనిచేశారు. అతను 37ఏళ్ల వయస్సులో వ్యాపారం ప్రారంభించాడు. ఇప్పుడు ఈ సమూహంలో 30 కంపెనీలు ఉన్నాయి. విశేషమేమిటంటే త్యాగరాజన్ వద్ద ఇప్పటికీ మొబైల్ లేదు. అందుకు కారణం అది అతని దృష్టిని మరల్చుతుందని తాను నమ్ముతున్నాడు. తన లైఫ్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇప్పటికీ తాను ఓ చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు.
Read Also:Flipkart New Sale: మరో సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. ఏకంగా 80 శాతం డిస్కౌంట్స్!
తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!