Site icon NTV Telugu

KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యార్..

Kkr

Kkr

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 సీజన్‌కు ఇంకా మూడు నెలలుకు పైగా టైం ఉంది. అయితే, ఇప్పటి నుంచే ఐపీఎల్‌ గురించి ఫ్యాన్స్‌లో తెగ చర్చ కొనసాగుతుంది. అందులోనూ డిసెంబర్‌ 19న ఐపీఎల్‌ ఆక్షన్ ఉండడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. చెన్నై, ముంబై జట్ల ఫ్యాన్స్ కు కెప్టెన్ ఎవరనేది అందరికి తెలుసు.. కెప్టెన్సీ విషయంలో ఈ రెండు జట్ల గురించి పెద్దగా చర్చ జరగదు.. కానీ, సన్‌రైజర్స్‌ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల సారథులు ఎవరు అనే దాన్నిపై క్రికెట్ అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే ఈ రెండు జట్లకు కెప్టెన్సీ మార్పు చాలా అవసరం.. ఇదే టైంలో కేకేఆర్ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది.

Read Also: AP Inter and 10th Exams: మార్చిలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు: మంత్రి బొత్స

అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యరే కొనసాగుతాడని కేకేఆర్‌ సీఈఓ వెంకీ మైసూర్ వెల్లడించారు. శ్రేయాస్ గాయం కారణంగా గత సీజన్‌ లో ఐపీఎల్‌లో ఆడలేదు.. దీంతో ఆ సీజన్‌లో నైట్ రైడర్స్ టీమ్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం ఆరు మ్యాచ్‌లే గెలిచింది. ఇక, ప్రస్తుతం శ్రేయాస్‌ అయ్యర్‌ గాయం నుంచి కోలుకోని వరల్డ్‌కప్‌లోనూ అదరగొట్టడంతో వచ్చే ఐపీఎల్ సీజన్‌లో అయ్యర్‌కి కెప్టెన్సీ బాధ్యతలను కేకేఆర్ యాజమాన్యం అప్పగించింది. ఇక, వైస్‌ కెప్టెన్‌గా నితీశ్‌రాణాను ఎంపిక చేసింది.

Exit mobile version