Site icon NTV Telugu

Shreya Ghoshal: సంచలన నిర్ణయం తీసుకున్న మరో స్టార్ సింగర్..

Shreya Ghoshal

Shreya Ghoshal

ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ తన పాటల ఎంపికలో సరికొత్త నిబంధనలను విధించుకున్నారు. 2012లో విడుదలైన ‘అగ్నిపథ్’ సినిమాలోని ‘చిక్ని చమేలి’ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఆ పాట పాడే సమయంలో తనకు సాహిత్యం (Lyrics) లోని లోతైన అర్థాలను గ్రహించే పరిణతి లేదని ఆమె తాజాగా వెల్లడించారు. ఆ పాటలోని కొన్ని పదాలు,వాటి అర్థంపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ తనను ఆలోచింపజేసిందని ఆమె పేర్కొన్నారు.

Also Read : Spirit : ప్రభాస్- సందీప్ వంగా ‘స్పిరిట్’ షూటింగ్ అప్‌డేట్..

శ్రేయ మాట్లాడుతూ.. ‘ఆ పాటలో అద్భుతమైన ట్యూన్, కళాత్మకత ఉన్నాయి. అది పెద్ద హిట్ కావడాన్ని నేను గౌరవిస్తాను. కానీ, చిన్న పిల్లలు ఆ పాటలోని అర్థం తెలియకుండా పాడుతుంటే నాకు ఇబ్బందిగా అనిపించేది. కొన్నిసార్లు నా దగ్గరకు వచ్చి ఆ పాట పాడమని అడిగితే చెప్పలేని అసౌకర్యానికి గురయ్యేదాన్ని. అందుకే అప్పటి నుండి పాటలను ఎంచుకునేటప్పుడు సాహిత్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాను. ఆ తర్వాత అలాంటి ఎన్నో ఐటెం సాంగ్స్ ఆఫర్లు వచ్చినా నేను సున్నితంగా తిరస్కరించాను’ అని శ్రేయ ఘోషల్ స్పష్టం చేశారు. పాట ఎంత పెద్ద హిట్ అయినా, అది సమాజంపై.. ముఖ్యంగా పిల్లలపై చూపే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రేయ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సింగర్‌గా కేవలం ట్యూన్‌కే కాకుండా, పదాలకు కూడా విలువ ఇవ్వాలనే ఆమె ఆలోచన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version