NTV Telugu Site icon

Shree TMT: శ్రీ టీఎంటీకి ‘గ్రీన్‌ప్రో ఎకోలేబుల్’ సర్టిఫికేషన్.. భారతీయ స్టీల్ పరిశ్రమలో ఓ కొత్త బెంచ్‌మార్క్!

Shree Tmt

Shree Tmt

హైదరాబాద్ నగరంలో అత్యుత్తమ స్టీల్ ఉత్పత్తికి గుర్తింపు పొందిన శ్రీ టీఎంటీ, దాని అన్ని టీఎమ్జీ రీబార్ ఉత్పత్తులకు ‘గ్రీన్‌ప్రో ఎకోలేబుల్’ సర్టిఫికేషన్ పొందడం ద్వారా ఒక ప్రతిష్టాత్మక మైలురాయిని సాధించింది. సీఐఐ-గ్రీన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కౌన్సిల్ చేత ప్రధానం చేయబడిన ఈ ప్రతిష్టాత్మక సర్టిఫికేషన్.. హైదరాబాద్, తెలంగాణలోని దేవశ్రీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేయబడిన, పర్యావరణానికి అనుకూలమైన తయారీ మరియు స్థిరమైన ఉత్పత్తి పద్దతుల పట్ల కంపెనీ నిబద్ధతని గుర్తించింది. ఈ ఘనత నిర్మాణ రంగం కోసం పర్యావరణ అనుకూలమైన మరియు మరింత స్థిరమైన భవిష్యత్తుకు దోహదం చేయడానికి శ్రీ టీఎంటీ ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది. హైదరాబాద్ ప్రాంతంలోని ఉత్తమ పారిశ్రామిక స్టీల్ ప్రొవైడర్లలో ఒకటిగా దాని స్థానాన్ని బలోపేతం చేస్తుంది.

గ్రీన్ సర్టిఫికేషన్ అంటే ఏమిటి?:
గ్రీన్‌ప్రో ఎకోలేబుల్ అనేది భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అభివృద్ధి చేసిన ఒక స్థిరత్వ సర్టిఫికేషన్. ఇది పర్యావరణానికి బాధ్యతాయుతమైన విధానాలను ఉపయోగించి తయారు చేయబడిన ఉత్పత్తులను గుర్తించడానికి, వాటి జీవిత చక్రం అంతటా పర్యావరణంపై కనిష్టమైన ప్రభావాన్ని చూపడానికి ఇది రూపొందించబడింది. ఒక ఉత్పత్తి అర్హత సాధించాలంటే.. దాని శక్తి సామర్థ్యం, వనరుల ఆప్టిమైజేషన్ మరియు ప్రమాదకర పదార్థాల తగ్గింపు వంటి అనేక అంశాలను తెలియపరిచే కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

ఈ సర్టిఫికేషన్ పొందడం అంటే తెలంగాణలో ఉత్తమ స్టీల్‌గా విస్తృతంగా గుర్తింపు పొందిన శ్రీ టీఎంటీ రీబార్లు అధిక నాణ్యతతో మాత్రమే కాకుండా స్థిరమైన పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి చేయబడుతున్నాయి. కనీస పర్యావరణ ప్రభావాన్ని నిర్ధారిస్తూ స్థిరమైన పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి చేయబడతాయి. జంషీద్ ఎన్ గోద్రేజ్ (చైర్మన్, సీఐఐ-గోద్రేజ్ జీబీసీ), ఎఆర్ ఉన్నికృష్ణన్ (చైర్మన్, సీఐఐ-గ్రీన్ ప్రొడక్ట్స్ & సర్వీసెస్ కౌన్సిల్), కెఎస్ వెంకటగిరి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఐఐ – గోద్రేజ్ జీబీసీ) వంటి పరిశ్రమ నాయకులచే ఈ సర్టిఫికేషన్ ఆమోదించబడింది. ఇది దాని విశ్వసనీయతకు నిదర్శనం.

ఈ సర్టిఫికేషన్ ఎందుకు ముఖ్యమైనది?:
నిర్మాణ రంగంలో ప్రధానంగా స్టీల్ మరియు సిమెంట్ వంటి పదార్థాల అధిక వాడకం కారణంగా ప్రపంచ కార్బన్ ఉద్గారాలకు దోహదం చేసే వాటిలో ప్రధానంగా చెప్పబడుతుది. గ్రీన్ సర్టిఫైడ్ ఉత్పత్తులను ఎంచుకోవడం ద్వారా నిర్మాణ దారులు, డెవలపర్లు తమ ప్రాజెక్టులకు తమ కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించగలరు. మన భారతదేశంలో ఉత్తమ స్టీల్‌లో ఒకటిగా గుర్తింపు పొందిన శ్రీ టీఎంటీ సర్టిఫైడ్ రీబార్లు అందులో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి నిర్మాణ సంస్థలు స్థిరత్వ లక్ష్యాలను సాధించడానికి, ప్రపంచ పర్యావరణ ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చేస్తాయి. అదే సమయంలో నిర్మాణ ప్రయోజనాల కోసం అధిక పటిష్టత, విశ్వసనీయమైన స్టీలు అందిస్తాయి.

నిర్మాణ పరిశ్రమకు ప్రయోజనాలు:
గ్రీనో లేబుల్ ఉత్పత్తుల వంటి శ్రీ టీఎంటీ రీబార్లను ఉపయోగించే ప్రాజెక్టులు అనేక ప్రయోజనాలను పొందుతాయి:
పర్యావరణంపై తక్కువ ప్రభావం: గ్రీన్ లేబుల్ ఉత్పత్తులు తక్కువ కార్బన్ ఉద్గారాలు, తక్కువ శక్తి వినియోగం మరియు కనిష్టమైన వ్యర్థ ఉత్పత్తిని నిర్ధారిస్తాయి. ఇది నిర్మాణ సంస్థలు స్థిరత్వ వాగ్దానాలతో మద్దతుగా సహాయవడుతుంది. శ్రీ టీఎంటీ పర్యావరణ అనుకూలమైన నిర్మాణానికి మద్దతు ఇచ్చే ఉత్తమ పారిశ్రామిక స్టీల్ కోసం మొదటి ఎంపికగా ఉంటుంది.
మార్కెట్ ఆమోదం: గ్రీన్ సర్టిఫైడ్ ఉత్పత్తులు వినియోగదారులు మరియు వ్యాపారాలు మరింత పర్యావరణ అవగాహన కలిగి ఉన్నందున ఈ ఉత్పత్తులు మార్కెట్లో అధికంగా ఆమోదం పొందుతున్నాయి. ఈ సర్టిఫికేషన్ శ్రీ టీఎంటీ మార్కెట్ కీర్తిని ఒక బాధ్యతాయుతమైన స్టీల్ తయారీ దారుగా పెంచుతుంది. హైదరాబాద్ మరియు తెలంగాణలో ఉత్తమ స్టీల్‌గా పరిగణించబడే ఉత్పత్తులను నిరంతరం అందిస్తుంది.

భారతీయ స్టీల్ పరిశ్రమలో ఓ కొత్త బెంచ్‌మార్క్:
శ్రీ టీఎంటీ ఘనత పర్యావరణ అనుకూలమైన పద్దతులను అవలంబించడానికి దాని చురుకైన విధానానికి మరియు భారతీయ స్టీల్ పరిశ్రమ కోసం ఒక కొత్త బెంచ్‌మార్క్ ను సెట్ చేయడానికి ఒక నిదర్శనం. గ్రీన్‌ప్రో ఎకోలేబుల్ సాధించడం ద్వారా కంపెనీ స్థిరమైన స్టీల్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో అగ్రస్థానంలో ఉంది.

గ్రీన్‌ప్రో ఎకోలాబెల్ సర్టిఫికేషన్ సాధించడం ద్వారా శ్రీ టీఎంటీ అత్యుత్తమ, నాణ్యత ఉక్కు ఉత్పత్తిదారుగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. అంతేకాదు వర్యావరణ సుస్థిరత పట్ల తన నిబద్ధతను పటిష్టం చేసింది. ఇతర కంపెనీలు కూడా దీనిని అనుసరించడానికి మార్గం సుగమం చేసింది.

Show comments