Wonder: పొలంలో ఏడు రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్న ఆవు.. అద్భుతమంటూ ఎగబడిన జనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శ్రావస్తి జిల్లా బస్భరియా పురైనా గ్రామంలో ఒక వింత ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి ఒక పొలంలో ఒక ఆవు గత ఏడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వృత్తాకారంలో చుట్టూ తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ వింత ప్రవర్తన, ఆ తర్వాత కూడా నిరంతరాయంగా కొనసాగింది. ఆవు ప్రవర్తనను చూసిన గ్రామస్థులు దీనిని ఒక దైవ లీలగా లేదా ఒక అద్భుతంగా భావించారు. ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు తండోపతండాలుగా ఆ గ్రామానికి రావడం మొదలుపెట్టారు. చాలా మంది ఆవును పూజించడం, కొందరు భక్తులు ఆవుతో పాటు ఆ పొలం చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించడంతో అక్కడ జాతర వాతావరణం నెలకొంది.
ఈ విషయం కాస్తా జిల్లా యంత్రాంగం మరియు పశువైద్య శాఖ దృష్టికి వెళ్లడంతో, ముఖ్య పశువైద్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్ సింగ్ నేతృత్వంలోని వైద్యుల బృందం గ్రామానికి చేరుకుని ఆవును నిశితంగా పరిశీలించింది. వైద్య పరీక్షల అనంతరం అసలు నిజం బయటపడటంతో మూఢనమ్మకాలకు తెరపడింది. ఆవు చూపిస్తున్న ఈ అసాధారణ ప్రవర్తనకు ఎలాంటి దైవిక శక్తులు కారణం కాదని, అది ‘సర్రా’ (హైపోగ్లైసీమియా) అనే తీవ్రమైన వ్యాధితో బాధపడుతోందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ వ్యాధి సోకినప్పుడు పశువుల మెదడుపై ప్రభావం పడి, అవి మానసిక సమతుల్యతను కోల్పోతాయని, ఫలితంగా ఒకే దిశలో వృత్తాకారంలో తిరగడం వంటి అసాధారణ పనులు చేస్తాయని వివరించారు.
Also Read
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- TMC Crisis: మమత బెనర్జీకి మరిన్ని కష్టాలు.. షాకిస్తున్న ఎంపీలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Emmanuel Macron: భారత్ ఆవిష్కరణల దేశం.. మేక్ ఇన్ ఇండియాకు మా పూర్తి గౌరవం: మాక్రాన్
उत्तर प्रदेश के जिला श्रावस्ती में गाय पिछले 8 दिन से एक ही खेत के लगातार चक्कर लगा रही थी। लोगों ने चमत्कार मानकर पूजा–अर्चना शुरू कर दी। गाय की तरह लोगों ने भी खेत की परिक्रमा शुरू कर दी।
अब पता चला है कि गाय को सर्रा (हाईपोग्लाइसीमिया) नामक बीमारी थी। डॉक्टर के इंजेक्शन लगाते… pic.twitter.com/hEDutH00RT
— Sachin Gupta (@Sachingupta) June 13, 2026
వెంటనే స్పందించిన పశువైద్యుల బృందం ఆవుకు తగిన చికిత్సను ప్రారంభించింది. మందులు వాడిన తర్వాత ఆవు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని, త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుందని వైద్యులు హామీ ఇచ్చారు. మరోవైపు గ్రామంలో రోజురోజుకూ పెరుగుతున్న జనసందోహాన్ని, శాంతిభద్రతల సమస్యను అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడికి వచ్చిన ప్రజలకు ఇది ఒక జబ్బు మాత్రమేనని, మూఢనమ్మకాలను నమ్మవద్దని నచ్చజెప్పి గుంపులను చెదరగొట్టారు. అనంతరం ఆవును దాని యజమానికి అప్పగించి, మళ్లీ అక్కడ ప్రజలు గుమిగూడకుండా చూసుకోవాలని కుటుంబ సభ్యులను ఆదేశించారు. పశువైద్యుల నివేదికతో అసలు విషయం తెలిసినప్పటికీ.. కొందరు ఇప్పటికీ దీనిని ఒక వింతగానే చూస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి సాధారణంగా ఉంది.
తాజావార్తలు
-
Wonder: పొలంలో ఏడు రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్న ఆవు.. అద్భుతమంటూ ఎగబడిన జనం..
-
NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
-
TMC Crisis: మమత బెనర్జీకి మరిన్ని కష్టాలు.. షాకిస్తున్న ఎంపీలు..
-
Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
-
Ram Charan: ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ – శ్రీకాంత్ ఓదెల మూవీపై క్రేజీ బజ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?