ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ 2025లో థ్రిల్లింగ్ మ్యాచెస్ జరుగుతున్నాయి. విశాఖపట్నంలో జరిగిన గత మూడు మ్యాచ్‌లలోనూ రసవత్తర పోరులు జరిగాయి. సోమవారం జరిగిన బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. బంగ్లాకు గెలిచే ఛాన్స్ వచ్చినా.. చివరి వరకు పోరాడి ప్రొటీస్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా యువ క్రీడాకారిణి షోర్నా అక్తర్ నయా హిస్టరీ క్రియేట్ చేసింది.
Also Read: Gold Rate Today: షాకింగ్ న్యూస్.. ఒక్కరోజులోనే రూ.3280 పెరిగిన బంగారం ధర! 2 లక్షలు దాటిన వెండి
బంగ్లాదేశ్ తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును షోర్నా అక్తర్ నెలకొల్పింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అక్తర్ 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదింది. ఈ క్రమంలో సుల్తానా రికార్డును బద్దలు కొట్టింది. ఈ సంవత్సరం ప్రారంభంలో మహిళల ప్రపంచకప్ క్వాలిఫైయర్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సుల్తానా 39 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదింది. అంతేకాదు ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (3) కొట్టిన తొలి బంగ్లాదేశ్ మహిళా క్రీడాకారిణిగా కూడా నిలిచింది. 2023లో శ్రీలంకతో జరిగిన వన్డేలో సుల్తానా రెండు సిక్సర్లు బాదింది. 18 ఏళ్ల వయసులోనే షోర్నా రెండు ప్రపంచ రికార్డులు సృష్టించింది.
