NTV Telugu Site icon

Shopping mall Hero: షాపింగ్ మాల్ హీరో ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

Actor Mahesh Tamil

Actor Mahesh Tamil

చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలనే సామేత అందరికి తెలుసు.. ఒకప్పుడు స్టార్ హోదాలో వారు ఇప్పుడు సరైన అవకాశాలు లేక దీన స్థితిలో ఉన్నారు.. కొందరు సీరియల్స్ లో నటిస్తే మరికొందరి పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి.. ఈ లిస్టులో షాపింగ్ మాల్ హీరో కూడా ఉన్నాడు.. ప్రస్తుతం అవకాశాలు లేక దారుణ స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది..

ఈ షాపింగ్ మాల్ సినిమా 2010 మార్చ్ 26న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.. అంతేకాకుండా అకాడమీ అవార్డు కూడా దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన అంజలి ప్రస్తుత కాలంలో కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ ఈ సినిమాలో నటించిన హీరో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.. హీరో పరిస్థితి బాగాలేదని తెలుస్తుంది..

అతని పేరు మహేష్.. షాపింగ్ మాల్ మూవీ తరువాత మహేష్ తమిళంలో 14 చిత్రాల్లో నటించాడు. ఇక మరో పక్క అంజలి సైతం అనేక సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక అక్కడి నుంచి అంజలి కెరీర్ కంటిన్యూ అయింది.. కానీ మహేష్ మాత్రం ప్లాప్ హీరోగా టాక్ తెచ్చుకున్నాడు.. వరుస ప్లాప్ సినిమాలు రావడంతో సినిమాలకు దూరం అయ్యి మాద్యానికి బానిస అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఎక్కడైనా టాలెంట్ ఉంటే రానిస్తారు. కానీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కావాలనే చెప్పొచ్చు. అదృష్టం లేకపోవడమే మహేష్ కి ఆఫర్స్ రాలేదు..