NTV Telugu Site icon

Mexico Shooting: బార్‌లో కాల్పుల కలకలం.. 9 మంది మృతి

Mexico Shooting

Mexico Shooting

Mexico Shooting: మెక్సికోలో కాల్పులు కలకలం సృష్టించాయి. మధ్య మెక్సికన్ రాష్ట్రం గ్వానాజువాటోలోని బార్‌లో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. బుధవారం రాత్రి అపాసియో ఎల్‌ ఆల్టో బార్‌లోకి చొరబడ్డ ‘మారో’ గ్యాంగ్‌ సాయుధులు అక్కడి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో నలుగురు మహిళావెయిటర్లతో సహా తొమ్మిది మంది బార్‌ సిబ్బంది మృతిచెందారు. బార్‌ యాజమాన్యం తమ ప్రత్యర్థి వర్గమైన జెలిస్కో క్రిమినల్‌ గ్యాంగ్‌కు మద్దతివ్వడమే ఇందుకు కారణమని పేర్కొంటూ ‘మారో’ గ్యాంగ్‌ అక్కడ ఓ పోస్టర్‌ను వదిలి వెళ్లారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో సాయుధ బృందం బార్ వద్దకు వచ్చింది. బుధవారం అపాసియో ఎల్ ఆల్టో పట్టణంలో, సెలయా వెలుపల, లోపల ఉన్న వారిపై కాల్పులు జరిపినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Russia-Ukraine War: రష్యా సైన్యమే లక్ష్యంగా ఉక్రెయిన్‌ దాడులు.. 50 మంది మృతి

ఫోరెన్సిక్ టెక్నీషియన్లు అపాసియో ఎల్ ఆల్టోలోని బార్‌లో విచారణ చేపట్టారు. దుండగులను ఇంకా గుర్తించలేదని అధికారులు తెలిపారు. రాష్ట్ర, సమాఖ్య అధికారుల యూనిట్లు అలాగే నేషనల్ గార్డ్‌లను ఆ ప్రాంతానికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. గత నెలలో కూడా ఇదే నగరంలోని ఓ బార్‌లో క్రిమినల్‌ గ్యాంగ్‌ జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా 12 మంది.. అంతకు ముందు నెలలో మరో బార్‌లో 10 మంది చనిపోయారు. మెక్సికోలో అపాసియో ఆల్టో నగరానికి మాదక ద్రవ్యాల క్రిమినల్‌ గ్యాంగ్‌లకు అడ్డాగా పేరుంది. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 2018లో కార్టెల్ హింసను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. 2022లో హత్యలు కొద్దిగా తగ్గాయి.

Show comments