Site icon NTV Telugu

Sholay Bike: IFFI గోవాలోప్రత్యేక ఆకర్షణగా షోలే బైక్ ..

Sholay Bike Iffi, Iffi Goa Attractions,

Sholay Bike Iffi, Iffi Goa Attractions,

భారతీయ సినిమా చరిత్రలో అద్భుతమైన మైలురాయిగా నిలిచిపోయిన షోలే చిత్రంలో ప్రతి పాత్ర, ప్రతి సీన్ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అందులో ముఖ్యంగా ‘యే దోస్తీ హమ్ నహీ తోడెంగే’ పాటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పాటలో అమితాబ్ బచ్చన్ (జై), ధర్మేంద్ర (వీరు) కలిసి నడిపిన లెజెండరీ బైక్ ఇప్పుడు మరోసారి చరిత్రను గుర్తు చేస్తుంది. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న IFFI (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) లో, ఈ పాటలో ఉపయోగించిన అసలైన 1942 BSA WM20 మోటార్‌సైకిల్‌ను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. MYB 3047 రిజిస్ట్రేషన్ నంబర్ గల ఈ బైక్‌ను చూడటానికి ఫెస్టివల్‌కు వచ్చిన సినీ ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

Also Read : Meena : ఏ హీరో విడాకులు తీసుకున్న నాకే లింక్ చేస్తున్నారు – మీనా ఫైర్

ఈ బైక్‌కు ఉన్న విశేషమేమిటంటే.. ఇది 83 ఏళ్ల పురాతన BSA WM20 మోడల్, మొదటగా బ్రిటిష్ మిలిటరీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మోటార్‌సైకిల్, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో వేల సంఖ్యలో ఉపయోగించిన లెజెండరీ మోడల్, అద్భుతమైన స్ట్రాంగ్ బిల్డ్, స్టేబుల్ రన్నింగ్ క్వాలిటీతో ఇప్పటికీ కండిషన్ మెయింటైన్ అవుతుంది. షోలే చిత్రం కోసం ఈ బైక్‌పై క్యారెక్టర్స్ జై–వీరు సన్నివేశాలను షూట్ చేయడానికి మొత్తం 21 రోజులు పట్టింది. ప్రతి షాట్‌లో ఉండే ఫ్రెండ్షిప్‌న్ని పర్ఫెక్ట్‌గా కాప్చర్ చేయడానికి దర్శకుడు రమేష్ సిప్పీ ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. IFFIలో ఈ బైక్‌ను చూసిన వారు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ, షోలే జ్ఞాపకాలను మళ్లీ తలచుకుంటున్నారు. సినీ అభిమానులకు, ముఖ్యంగా షోలే లవర్స్‌కు ఈ బైక్‌ను ప్రత్యక్షంగా చూడటం ఒక పెద్ద ఆనందంగా మారింది.

Exit mobile version