NTV Telugu Site icon

Pune Porsche case: మైనర్‌కు బెయిల్ ఇవ్వడంపై బాధితురాలి తల్లి తీవ్ర ఆవేదన

Pune

Pune

పూణె కారు ప్రమాదం కేసులో మైనర్ నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలి అశ్విని కోష్ట తల్లి మమతా కోష్ట దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనతో షాకింగ్‌కు గురైనట్లు తెలిపింది. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని.. అయితే తాము పడుతున్న బాధను కూడా కోర్టు కూడా ఎరగాలని పేర్కొ్న్నారు.

ఇది కూడా చదవండి: Brown Sugar : వామ్మో.. బ్రౌన్ షుగర్ వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనలా..

మే 19న మద్యం మత్తులో మైనర్ బాలుడు అత్యంత వేగంగా కారు నడిపి ఇద్దరు టెకీల మరణానికి కారణమయ్యాడు. తొలుత గంటల వ్యవధిలోనే బెయిల్ లభించింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో బెయిల్ రద్దైంది. తాజాగా మంగళవారం మైనర్ నిందితుడి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తక్షణమే విడుదల చేయాలని ఆదేశించి. జువైనల్ నిందితుల్ని పెద్దల తరహాలో ట్రీట్‌ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. చట్టం ప్రకారమే నడుచుకుంటున్నట్లు న్యాయస్థానం తెలిపింది.

ఇది కూడా చదవండి: Kenya: కొత్త పన్నుల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన.. పార్లమెంట్ భవనానికి నిప్పు

ఇదిలా ఉంటే ఈ కేసులో జరిగిన పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నిందితుడికి బెయిల్ మంజూరు అయిన దగ్గర నుంచి అన్నింటిలో అక్రమాలు జరిగినట్లు కమిటీ గుర్తించింది. ఇక నిందితుడి మెడికల్ రిపోర్టు మార్చినందుకు వైద్యులపై ప్రభుత్వం వేటు వేసింది. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు వేసింది. అంతేకాకుండా బెయిల్ మంజూరు చేసిన కోర్టు తీరుపై కూడా దర్యాప్తు జరుగుతోంది. బెయిల్ విషయంలో కూడా అక్రమాలు జరిగినట్లుగా కమిటీ గుర్తించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..