Site icon NTV Telugu

Adulterated sauces: సాస్ లను ఎక్కువగా తింటున్నారా? ఇది చూస్తే జన్మలో వాటి జోలికి వెళ్లరు..

Saucess

Saucess

ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకోమని ఆరోగ్య నిపుణులు అంటే జనాలు అసలు పట్టించుకోరు.. నోటికి రుచిగా, మంచి వాసనలు వచ్చే వాటి వైపే మొగ్గు చూపిస్తారు.. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడతారు.. అలాంటి వాటికి సాస్లను ఎక్కువగా వాడుతారు.. జనాలు అందుకే జంక్ ఫుడ్స్ ను ఇష్టంగా లాగిస్తారు.. మొన్నీమధ్య గోబీ, వెజ్ మంచూరియాలను బ్యాన్ చేశారనే వార్తలు వినిపించాయి.. ఇప్పుడు సాస్ ల గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది..

కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు డబ్బుల కోసం మనుషుల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు.. తినే తిండి దగ్గర నుంచి పిల్లల పాల పొడివరకు అన్నిట్లోను కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు.. ఇటీవల చాలా చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి సీజ్ చేస్తూ వస్తున్నారు.. అయినా కేటుగాళ్ళ ఆగడాలు ఆగడం లేదు.. మొన్న అల్లం, వెల్లుల్లి పేస్ట్ లో కల్తీ చేస్తూ దొరికారు.. తాజాగా సాస్ లను కల్తీ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు..

వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ సాస్ తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.. శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ లో పక్కా సమాచారంతో దాడులు చేశారు.. తనిఖీలు నిర్వహించిన అధికారులు అక్కడ తయారు చేసే సాస్ లలో ప్రాణాంతక రసాయనాలు, సింథటిక్ రంగులతో సాస్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.. టైం అయిపోయిన సాస్ ప్యాకెట్లు, బాటిల్స్ కు కొత్త తేదీలతో స్టిక్కర్స్ వేసి మార్కెట్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సుమారు 772 లీటర్ల సాస్, 30 లీటర్ల ఎసిటిక్ యాసిడ్ తో పాటు 13 కిలోల కార్న్ ఫ్లోర్ ను స్వాధీనం చేసుకున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Exit mobile version