Tirupati Crime: తిరుపతి సమీపంలోని దామినేడులోని ఓ ఇంట్లో కుళ్లిన మూడు మృతదేహాలు కలకలం రేపాయి. తమిళనాడు రాష్ట్రం, గుడియాత్తంకు చెందిన సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీశ్ మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితం ఇరువురు కూడా వివాహేతర సంబంధంతో సొంత ఊరిని వదిలి తిరుపతికి వచ్చి ఇక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. ఏం జరిగిందో ఏమో.. కానీ, గత నెల 22వ తేదీ నుండి ఇంటి నుండి బయటకు రాలేదు.. ఇంటి నుండి దుర్వాసన రావడంతో స్దానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేుకున్న పోలీసులు.. ఆ ప్రాంతాన్ని పరిశీలించగా.. మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే, ప్రియురాలని ఆమె బిడ్డకు విషం తాగించి చంపిన తర్వాత.. ప్రియుడు సత్యరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానిస్తున్నారు పోలీసులు..
Tirupati Crime: తిరుపతిలో కలకలం.. ఓ ఇంట్లో కుళ్లిపోయిన మూడు మృతదేహాలు..!

Crime