Site icon NTV Telugu

Naga Chaitanya Shobita Weeding: మొదలైన నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు..

Naga Chaitanya Shobita Weeding

Naga Chaitanya Shobita Weeding

Naga Chaitanya Shobita Weeding: త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల జంటకు సంబంధించి పెళ్లి పనులు మొదలయ్యాయి. పెళ్లి పనులకు సంబంధించిన పనులు మొదలైనట్లుగా శోభిత కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శోభిత ఈ ఫోటోలను పంచుకుంటూ గోధుమ రాయి పసుపు దంచడంతో పెళ్లి పనులు మొదలైనట్లు తెలిపింది. వైజాగ్ లోని శోభిత స్వగృహంలో కార్యక్రమం జరిగింది. వీరి పెళ్లి డిసెంబర్ మొదటి వారంలో పెళ్లి జరగబోతుందని తెలిసిందే. అయితే తేదీ మాత్రం ఖరారు కాలేదు.

Read Also : Malla Reddy Mass Dance: పెళ్లి సంగీత్ లో మల్లన్న మాస్‌ స్టెప్పులు..

ఇకపోతే, సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య – శోభితలు ప్రేమలో పడిన సంగతి విదితమే. వీరిద్దరూ కలిసి తిరిగిన కొన్ని ఫోటోలు ఇదివరకు బయటకు రావడంతో.. వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. మొత్తానికి వీటిని నిజమని నిరూపిస్తూ.. ఆగస్టు 8న నాగచైతన్య – శోభితల నిశ్చితార్థం జరిగింది. ఆ కార్యక్రమం కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన వేడుక సంబంధించి ఫోటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Exit mobile version