NTV Telugu Site icon

Shivathmika Rajashekar : కిల్లింగ్ పోజులతో రెచ్చగొడుతున్న శివాత్మిక..

Whatsapp Image 2023 07 13 At 11.38.39 Am

Whatsapp Image 2023 07 13 At 11.38.39 Am

శివాత్మిక..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయమయింది.2019లో విడుదలైన దొరసాని చిత్రంతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది శివాత్మిక..ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది కానీ కమర్షియల్ గా ఆడలేదు. అయితే ఆ తరువాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. అలాగే ఈ మధ్య ఈ భామ తన హాట్ అందాలతో రెచ్చగొడుతుంది.తాజాగా చీర కట్టులో కనిపించి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపింది శివాత్మిక. ఆమె కొంటె పోజులు మతి పోగొడుతున్నాయి.శివాత్మిక గ్లామరస్ ఫోటో షూట్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది…శివాత్మిక సోషల్ మీడియా లో కూడా సెన్సేషన్ గా మారుతున్నారు.తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తూ నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది..

ఈ యంగ్ బ్యూటీ అటు ట్రెడిషనల్ గా ఇటు ట్రెండీగా కూడా అలరిస్తుంది.తాజాగా చీర కట్టి స్టన్నింగ్ పోజులతో రెచ్చగొడుతుంది. ట్రెడిషనల్ వేర్ లో శివాత్మిక సోయగాలు మైమరిపిస్తున్నాయి. శివాత్మిక లేటెస్ట్ లుక్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ఈ భామ లుక్స్ కి నెటిజన్స్, ఫ్యాన్స్ వరుస కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.. అయితే రీసెంట్ గా ఆమె ముఖ్య పాత్ర పోషించిన రంగమార్తాండ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణల కూతురు పాత్రలో ఆమె నటించి మెప్పించింది..రంగమార్తాండ మూవీలో శివాత్మిక పాత్రకు ప్రశంసలు కూడా దక్కాయి. రంగమార్తాండ మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా ఆకట్టుకోలేదు.. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండలో అనసూయ కూడా కీలక పాత్ర పోషించింది.గత ఏడాది శివాత్మిక నటించిన ప్రయోగాత్మక చిత్రం పంచతంత్రం కూడా విడుదలైంది. పంచతంత్రం సినిమాకు అంతగా ప్రేక్షకాదరణ దక్కలేదు. అలాగే ఆకాశం అనే టైటిల్ తో విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ కూడా అంతగా మెప్పించలేదు.. కాగా తమిళంలో కూడా శివాత్మికకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కానీ శివాత్మికకు బ్రేక్ ఇచ్చే సినిమా ఒక్కటి కూడా రావడం లేదు.