Sampradayini Suppini Suddapusani: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న బిగ్ బాస్ శివాజీ కొత్త సినిమా! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sampradayini Suppini Suddapusani: వైవిధ్యభరితమైన టైటిల్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన సినిమా.. ‘సంప్రదాయిని సుప్పిణి సుద్దపూసని’ (SSS). ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ సందడికి రెడీ అవుతుంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ విషయంలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. నిజానికి ఈ చిత్రం ఫిబ్రవరి 12న డైరెక్ట్‌గా ETV Winలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మేకర్స్ మనసు మార్చుకుని మార్చి 6న ఈ మూవీని వెండి తెరపైకి తీసుకొచ్చారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ సినిమా, ఇప్పుడు మళ్లీ ఓటీటీ బాట పట్టింది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫస్ట్ అనుకున్నట్టుగా కాకుండా, ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ 3న గ్రాండ్‌గా ప్రీమియర్ కానుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
- Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
- Abhishek Banerjee: "నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు".. చిక్కుల్లో మమత మేనల్లుడు
ఈ చిత్రంలో శివాజీ, లయ, మాస్టర్ రోహన్, ప్రిన్స్ సిసిల్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి రంజన్ రాజ్ సంగీతం అందించారు. నటుడు శివాజీ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. థియేటర్లలో మిక్సిడ్ టాక్ పొందిన ఈ క్రైమ్ కామెడీకి ఓటీటీ ఆడియన్స్ ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. ఇది కేవలం తెలుగులోనే ఉంటుందా లేదా ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వస్తుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
కథ:
చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని ఒక పంచాయతీ సెక్రటరీగా పనిచేసే శ్రీరామ్ (శివాజీ) అంటే అందరికీ గౌరవం. నీతి, నిజాయితీలే తన ఊపిరిగా భావించే శ్రీరామ్, భార్య ఉత్తర (లయ), కొడుకు రోహన్‌తో కలిసి ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో ఊహించని ఒక సంఘటన ఎలా వారి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ సంఘటన ఏంటి, వారు ఆ ఊహించని సంఘటన నుంచి ఎలా బయటపడుతారు అనేది కథ.
READ ALSO: UP Police: పోలీసుల చేతులు కట్టేసిన హైకోర్టు.. ఇకపై ఆ 31 నేరాలకు నో FIR!
తాజావార్తలు
-
Ducati Collezione 100: డుకాటి ‘Collezione 100’ స్పెషల్ ఎడిషన్ బైక్స్.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
-
Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
-
Best Budget Cars: టాటా నుంచి సిట్రోయెన్ వరకు.. 360-డిగ్రీ కెమెరాతో వచ్చే చౌకైన కార్లు ఇవే.. ధరలు రూ.6.99 లక్షల నుంచే!
-
Harappa Facts: ‘ఆ ముద్రపై కనిపిస్తున్న వ్యక్తి శివుడు కాదు..?’ అమెరికన్ చరిత్రకారిణి వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..