Site icon NTV Telugu

Shine Tom Chacko: బహిరంగంగా క్షమాపణలు చెప్పిన ‘దసరా’ విలన్‌.. వివాదానికి ముగింపు!

Shine Tom Chacko

Shine Tom Chacko

మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్‌కు నటుడు షైన్‌ టామ్‌ చాకో బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. షూటింగ్ సమయంలో జరిగిన దానికి తాను క్షమాపణలు చెబుతున్నా అని, కావాలని చేసింది కాదని చాకో తెలిపారు. ఆ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. చాకో నుంచి అలాంటి అనుభవంను తాను అస్సలు ఊహించలేదని విన్సీ చెప్పారు. వివాదం సమసిపోయినందుకు సంతోషంగా ఉందన్నారు. చాకో, విన్సీ కలిసి నటించిన చిత్రం ‘సూత్రవాక్యం’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా త్రిస్సూర్‌లోని పుతుక్కాడ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విన్సీకి చాకో క్షమాపణలు చెప్పారు.

Also Read: Telangana Cabinet: జులై 10న తెలంగాణ కేబినెట్ భేటీ.. ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా?

సుత్రవాక్యం సినిమా ప్రమోషన్‌కు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో షైన్‌ టామ్‌ చాకో మాట్లాడుతూ… ‘జరిగిన దానికి క్షమాపణలు కోరుతున్నాను. ఉద్దేశపూర్వకంగా నేను ఏమీ చేయలేదు. నేను సరదాగా చెప్పాను. విన్సీకి ఎటువంటి హాని కలిగించే ఉద్దేశ్యం నాకు లేదు. విన్సీ అంత తీవ్రంగా స్పందించడానికి కారణం ఉంది. ఎవరో ఆమెను బాగా ప్రోత్సహించారు’ అని అన్నాడు. చాకో పక్కనే ఉన్న విన్సీ మాట్లాడుతూ… ‘నేను ఆరాధించే వ్యక్తి నుంచి ఎలాంటి ప్రవర్తనను ఊహించలేదు. ఆ సమయంలో నేను బాధపడ్డాను. నేను స్పందించిన తీరు చాకో కుటుంబాన్ని ఎంతో బాధించింది. ఇప్పుడు ముగిసింది’ అని పేరొన్నారు. గత ఏప్రిల్‌లో షూటింగ్ సమయంలో చాకో తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడంటూ సోనీ ఆరోపించారు. మలయాళ ఫిల్మ్‌ ఛాంబర్‌లోనూ ఆమె ఫిర్యాదు చేశారు.

Exit mobile version