NTV Telugu Site icon

Shilpa Shetty : శిల్పా శెట్టి ఇలాంటివి కూడా చేస్తారా?నెటిజన్స్ ఫిదా..

Shilpa Shetty

Shilpa Shetty

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఈమె పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పుడూ ఆసక్తికర పోస్టులు షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటోంది.. ఎప్పుడూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసే ఈ అమ్మడు ఇప్పుడు షేర్ చేసిన ఫోటోలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి..

తాజాగా ఈ అమ్మడు విసురాయి తిప్పుతూ కనిపించింది.. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాకుండా దానిని తిప్పడం వల్ల ఎలాంటి ప్రయజనాలు కలుగుతాయో చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నేను ఇటీవల రాజస్థాన్ పర్యటనలో, నేను ఒక చక్కిని చూసినప్పుడు, నేను దీన్ని చేయాలని నాకు తెలుసు. ఓ మై గాడ్.. చాలా బరువుగా ఉంది.. దీన్ని రోజూ చేస్తే ఇక చాలా మంచిది.. చేతులు బలంగా తయారవ్వడం మాత్రమే కాదు.. బాగా అరుగుతుందని చెబుతుంది..

గర్భం సమయంలో కొంచెం జాగ్రత్తలు పాటించడం మంచిది.. వెనుక, స్నాయువు కండరాల వశ్యతను పెంచుతుంది. మీ మూలాల్లోకి తిరిగి వెళ్లి అసలు చక్కి పని చేయడం వల్ల క్రమం తప్పకుండా చేసే వ్యక్తుల పట్ల మీకు అపారమైన గౌరవం లభిస్తుంది. మీకు వెన్నునొప్పి ఉన్నట్లయితే, స్లిప్-డిస్క్‌తో బాధపడుతుంటే, గర్భధారణ సమయంలో ఈ ఆసనాన్ని ఆచరించకుండా చూసుకోండి.. ఈ వీడియో పై క్యాప్షన్ కూడా ఇచ్చింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

Show comments