Shikhar Dhawan: గబ్బర్ కొత్త ఇన్నింగ్స్.. సోఫీతో శిఖర్ ధావన్ వెడ్డింగ్.. ఫోటోలు పంచుకున్న చాహల్!

Shikhar Dhawan

Shikhar Dhawan

Shikhar Dhawan: భారత క్రికెట్ జట్టులో తనదైన శైలిలో దూసుకుపోయిన శిఖర్ ధావన్, తన నిజ జీవితంలోనూ ఒక అందమైన లక్ష్యాన్ని చేరుకున్నారు. గత కొంతకాలంగా ఆయన ప్రేమలో ఉన్న సోఫీని తాజాగా పెళ్లాడారు. ఈ విషయాన్ని ధావన్ సన్నిహిత ఫ్రెండ్, క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అభిమానులు షాక్‌తో పాటు ఆనందానికి గురవుతున్నారు. ఈ వివాహ వేడుక కోసం శిఖర్, సోఫీ జంట ‘వైట్ అండ్ ఐవరీ’ థీమ్‌ను ఎంచుకున్నట్లు వాళ్ల పెళ్లి ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది.

READ ALSO: AP Liquor Scam Case: ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అరెస్ట్.. రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు..!

సోఫీ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ఐవరీ, ఆరెంజ్ కలర్ 3D ఫ్లోరల్ లెహంగాలో మెరిసిపోయింది. ముత్యాల ఎంబ్రాయిడరీ బ్లౌజ్, చేతితో చేసిన పూల డిజైన్ ఆమెకు ఒక దివ్యమైన అప్సరసలాంటి లుక్‌ను ఇచ్చాయి. సోఫీ ధరించిన ఈ ఖరీదైన లెహంగా ధర సుమారు రూ.8.25 లక్షలు ఉంటుందని సమాచారం. దీనికి తోడు ముత్యాలు, కుందన్ ఆభరణాలు ఆమె అందాన్ని మరింత పెంచాయి. మన గబ్బర్ భాయ్ తెల్లటి ఎంబ్రాయిడరీ షేర్వానీ, తలపాగా ధరించి ఒక రాచరిక యువరాజులా కనిపించాడు. మెడలో ధరించిన పచ్చల హారం ఆయన లుక్‌కు హైలైట్‌గా నిలిచింది.

చాహల్ సందడి.. డ్యాన్స్ వీడియోలు వైరల్!
“ఇది నా స్నేహితుడి పెళ్లి..” అంటూ చాహల్ ఇన్స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. కేవలం ఫోటోలే కాకుండా, పెళ్లి వేడుకలో అతిథులతో కలిసి చాహల్ చేసిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. చాహల్ కూడా తెలుపు రంగు కోటు ధరించి ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శిఖర్ ధావన్ సోఫీతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడంపై క్రికెట్ ప్రపంచం, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

READ ALSO: Ravi Basrur: ఆ రూ.35 వేలే నా జీవితాన్ని మార్చాయి.. స్టేజ్ పైనే ఏడ్చేసిన రవి బస్రూర్!