Sherfane Rutherford Awarded Half Acre Land in USA for Montreal Tigers Victory in GT20 Canada: క్రికెట్‌లో ‘మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్‌ది సిరీస్’ అవార్డులు ఉంటాయని అందరికి తెలిసిందే. సెంచరీ చేస్తే.. ఎక్కువ వికెట్స్ పడగొడితే.. విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడితే మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభిస్తుంది. ఇక సిరీస్ ఆసాంతం మంచి ప్రదర్శన చేసిన వారికి మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కుతుంది. సాధారణంగా మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ లేదా మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌లకు క్యాష్ రివార్డు, ఖరీదైన బైక్స్, లేదా కొత్త కార్లు ఇస్తుంటారు. అయితే ఇందుకు బిన్నంగా అర ఎకరం భూమిని ఇచ్చారు, అది కూడా అగ్రరాజ్యం అమెరికాలో.
గ్లోబల్ టీ20 కెనడా క్రికెట్ టోర్నమెంట్ మూడవ ఎడిషన్ 2023 జూలై 20 నుంచి ఆగస్టు 6 వరకు జరిగింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సర్రే జాగ్వార్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన మాంట్రియల్ టైగర్స్ విజేతగా నిలిచింది. టోర్నమెంట్ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన వెస్టిండీస్ క్రికెటర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌కు ‘మ్యాన్ ఆఫ్‌ది సిరీస్’ అవార్డు దక్కింది. కెనడా గ్లోబల్ టీ20 లీగ్ నిర్వహకులు విన్నూతంగా ఆలోచించి రూథర్‌ఫోర్డ్‌కు అమెరికాలో అర ఎకరం భూమి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గ్లోబల్ టీ20 కెనడా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. మాంట్రియాల్ టైగర్స్ చాంపియన్‌గా నిలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. 29 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఫైనల్‌లో రూథర్‌ఫోర్డ్ అసాధారణ ప్రదర్శన అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరియు మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్ వంటి ప్రతిష్టాత్మక టైటిళ్లను సంపాదించి పెట్టింది. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున రూథర్‌ఫోర్డ్ సత్తాచాటాడు.
Also Read: Tomoto Price Today: దిగొస్తున్న టమాటా ధరలు.. ఇక కొనేసుకోవచ్చు! రైతుబజార్లో కిలో ఎంతంటే?
ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సర్రే జాగ్వార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జతీందర్ సింగ్ (56; 57 బంతుల్లో 3 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. అయాన్ ఖాన్ (26), మహ్మద్ హరీస్ (23) రాణించారు. మాంట్రియాల్ టైగర్స్ బౌలర్లు ఆండ్రీ రస్సెల్, అయాన్ ఖాన్ తలో రెండు వికెట్స్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో మాంట్రియాల్ చివరి బంతికి విజయాన్ని అందుకుంది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ సహా ఆండ్రీ రస్సెల్ (6 బంతుల్లో 20 పరుగులు) చెలరేగారు. చివరి ఓవర్లో 13 రన్స్ అవసరం కాగా.. రస్సెల్ రెండు భారీ సిక్సులు బాదాడు.
It was a busy presentation ceremony for Sherfane Rutherford and deservingly so 🫶
Dean Jones – Most Valuable Player ✅
Finals Man of the Match ✅
Moment of the Match ✅#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/OCHQxU4IlT— GT20 Canada (@GT20Canada) August 7, 2023