Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Shehbaz Sharif Draft Tweet Controversy Trump Iran Crisis Pakistan

Shehbaz Sharif: “పాక్ ‘కాపీ-పేస్ట్’ దౌత్యం”.. వైట్ హౌస్ స్క్రిప్ట్‌ను డ్రాఫ్ట్‌లో పెట్టి అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్ ప్రధాని..

Published Date :April 8, 2026 , 8:18 am
By RAMAKRISHNA KENCHE
Shehbaz Sharif: “పాక్ ‘కాపీ-పేస్ట్’ దౌత్యం”.. వైట్ హౌస్ స్క్రిప్ట్‌ను డ్రాఫ్ట్‌లో పెట్టి అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్ ప్రధాని..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Shehbaz Sharif: ఇజ్జత్ తీసుకోవడంలో పాకిస్థాన్‌ను మంచిన దేశం మరొకటి లేదు. తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ఓ మిస్టెక్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇరాన్ సంక్షోభం విషయంలో పాక్ వ్యవహరిస్తున్న తీరుపై అనేక అనుమానాలకు ఈ పోస్ట్ తావిచ్చింది. అసలు విషయం ఏమిటంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక విజ్ఞప్తి చేశారు. ఇరాన్‌పై విధించిన గడువును మరో రెండు వారాల పాటు పొడిగించాలని, దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఉంటుందని ట్వీట్‌లో కోరారు. ఇరాన్ సైతం ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ను తిరిగి తెరవాలని షరీఫ్ సూచించారు.

READ MORE: NTRNeel : పుకార్లను కొట్టిపారేసిన మేకర్స్.. ‘డ్రాగన్’ షూటింగ్‌పై అఫీషియల్ ప్రకటన

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ.. ఈ పోస్ట్ పెట్టిన కొన్ని నిమిషాలకే దాన్ని ఎడిట్ చేశారు. దీన్ని సోషల్ మీడియా యూజర్లు గమనించారు. ఆ ఎడిట్ హిస్టరీని పరిశీలిస్తే షరీఫ్ అడ్డంగా దొరికిపోయారనే చర్చ మొదలైంది. ఎందుకంటే, ఆ పోస్ట్ మొదటి వెర్షన్‌లో “Draft – Pakistan’s PM Message on X” (డ్రాఫ్ట్ – ఎక్స్‌లో పాక్ ప్రధాని సందేశం) అని రాసి ఉంది. ఇది చూసిన సోషల్ మీడియా యూజర్లు పాకిస్థాన్ దౌత్యంపై సెటైర్లు వేస్తున్నారు. ఆ సందేశం పాక్ సొంతంగా రాసుకున్నది కాదని, ఎవరో పంపిన స్క్రిప్ట్‌ను షరీఫ్ అలాగే కాపీ-పేస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వైట్ హౌస్ పంపిన ఇన్స్ట్రక్షన్స్‌ను తొలగించడం మర్చిపోయి ప్రధాని అలాగే పోస్ట్ చేశారంటూ స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. దీంతో “పాకిస్థాన్‌ను డొనాల్డ్ ట్రంప్ నియంత్రిస్తున్నారా?” అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాక్ ప్రధాని తనంతట తానుగా సందేశాలు ఇవ్వడం లేదని, బయటి శక్తుల ప్రభావంతోనే ఈ పోస్టులు వస్తున్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ, ఇరు దేశాల ప్రతిపాదనలను అటుఇటు మారుస్తోంది. “దౌత్య ప్రయత్నాలు బలంగా, శక్తివంతంగా సాగుతున్నాయి, యుద్ధానికి ముగింపు పలకాలంటే గడువు పొడిగించడం అవసరం” అని షరీఫ్ తన సందేశంలో పేర్కొన్నప్పటికీ, ఈ ‘డ్రాఫ్ట్’ వివాదం ఆయన అసలు ఉద్దేశాన్నే పక్కదారి పట్టించింది.

Download (1)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • geopolitics Pakistan US relations
  • Hormuz Strait issue
  • Pakistan diplomacy criticism
  • Pakistan draft tweet viral
  • Shehbaz Sharif tweet controversy

తాజావార్తలు

  • Shehbaz Sharif: “పాక్ ‘కాపీ-పేస్ట్’ దౌత్యం”.. వైట్ హౌస్ స్క్రిప్ట్‌ను డ్రాఫ్ట్‌లో పెట్టి అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్ ప్రధాని..

  • NTRNeel : పుకార్లను కొట్టిపారేసిన మేకర్స్.. ‘డ్రాగన్’ షూటింగ్‌పై అఫీషియల్ ప్రకటన

  • Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్‌కు కీలక అదేశాలు..

  • IMD Rain Alert: ఢిల్లీ సహా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

  • DC vs GT: నేడు ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్.. రెడీ అవుతోన్న వరుణుడు.. ఢిల్లీలో వాతావరణం ఎలా ఉండబోతోంది?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions