NTV Telugu Site icon

Shaun Marsh: ఆస్ట్రేలియా ప్లేయర్ సంచలన నిర్ణయం.. ఫామ్‌లో ఉండగానే..!

Shaun Marsh Retirement

Shaun Marsh Retirement

Shaun Marsh announces retirement from all forms of cricket: ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్‌లో ఉండగానే ప్రొఫెషనల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మార్ష్‌.. ఇప్పుడు అన్ని రకాల క్రికెట్‌ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)లో జనవరి 16న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచ్‌ తనకు చివరిదని షాన్ మార్ష్ తెలిపాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ప్రొఫెషనల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరఫున ఆడుతున్న షాన్ మార్ష్ ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాడు. చివరి మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌పై 49 బంతుల్లో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతేకాదు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు కూడా దక్కించుకున్నాడు. మార్ష్‌ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో ఫాన్స్ సహా అందరూ షాకయ్యారు. 2001లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసినప్పుడు మార్ష్ వయసు 17 ఏళ్ల 236 రోజులు. పెర్త్ స్కార్చర్స్‌ తర్వాత అతను 2019లో రెనెగేడ్స్‌లో చేరాడు.

Also Read: IPL 2024 Final: ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి.. విజేతగా సన్‌రైజర్స్ హైదరాబాద్!

షాన్ మార్ష్ 2008 నుంచి 2019 వరకు 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ20లలో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తంగా 5,293 పరుగులు చేశాడు. టెస్ట్‌లలో 2265, వన్డేలలో 2773, టీ20లలో 255 రన్స్ బాదాడు. 2017-18లో ఆస్ట్రేలియా యాషెస్ విజయంలో మార్ష్ కీలక పాత్ర (రెండు సెంచరీలు) పోషించాడు. 2008-17 మధ్యలోపలు ఐపీఎల్‌ ఫ్రాంచైజీల తరఫున 71 మ్యాచ్‌లు ఆడిన మార్ష్ 2477 పరుగులు చేశాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌కు స్వయానా అన్న విషయం తెలిసిందే.