NTV Telugu Site icon

Shatamanam Bhavati Next Page : శతమానం భవతి సీక్వెల్ వచ్చేస్తుంది.. ఆఫీషియల్ గా అనౌన్స్ చేసిన దిల్ రాజు..

Whatsapp Image 2024 01 15 At 12.25.51 Pm

Whatsapp Image 2024 01 15 At 12.25.51 Pm

ఏడేళ్ల క్రితం (2017) లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన శతమానం భవతి మూవీ ఉత్తమ ప్రజాదరణ పొందిన మూవీగా నేషనల్ అవార్డును దక్కించుకున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈమూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. చిరంజీవి ఖైదీ నంబర్ 150 మరియు బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలకు పోటీగా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.శతమానం భవతి సినిమాలో శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్‌ మరియు జయసుధ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించాడు. కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలకు పెద్దపీట వేస్తూ దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాను తెరకెక్కించిన తీరుకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.దాదాపు పదిహేను కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ నలభై కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు 16 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది.

ఇదిలా ఉంటే ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీకి సీక్వెల్ రాబోతోంది.సంక్రాంతి సందర్భంగా సోమవారం ఈ సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా రివీల్ చేశారు.ఈ సినిమాకు శతమానం భవతి నెక్స్ట్ పేజీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 2025 సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.దిల్ రాజు ఈ మూవీని నిర్మించనున్నాడు. ఈ సీక్వెల్‌లో నటించనున్న హీరోహీరోయిన్లు ఎవరన్నది త్వరలోనే రివీల్ చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.శతమానం భవతి నెక్స్ట్ పేజీని కొత్త నటీనటులతో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి శతమానం భవతి నెక్స్ట్ పేజీ సినిమాతో పాటు చిరంజీవి విశ్వంభర మూవీ కూడా రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. 2017 సంక్రాంతికి ఖైదీ నంబర్ 150, శతమానం భవతి రిలీజయ్యాయి. మళ్లీ చిరంజీవి సినిమాకు పోటీగా శతమానం భవతి సీక్వెల్ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే శతమానం భవతి సీక్వెల్‌కు డైరెక్టర్ మారనున్నట్లు సమాచారం. శతమానం భవతికి రైటర్‌గా పనిచేసిన హరి ఈ సీక్వెల్‌కు కథను అందిస్తున్నట్లు తెలిసింది. అతడే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడా లేక మరో డైరెక్టర్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది.

Show comments