NTV Telugu Site icon

Manamey : శర్వానంద్ ‘మనమే’ రిలీజ్ డేట్ పై స్పెషల్ అప్డేట్ వైరల్..

Sharwanand

Sharwanand

Manamey : టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శర్వానంద్ హీరోగా మారి వరుస సినిమాల్తోప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.ప్రస్తుతం ఈ హీరో వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.శర్వానంద్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మనమే”..ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ తెరకెక్కిస్తున్నారు.అలాగే ఏడిద రాజా అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

Read Also :Viswambhara : మెగాస్టార్ మూవీ లో మరో యంగ్ హీరోయిన్..

ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో 35 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్సె వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అలాగే ఈ మూవీ నుంచి వచ్చిన “ఇక నా మాటే”సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా రీలీజ్ డేట్ పై మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు స్పెషల్ పోస్టర్ రీలీజ్ చేసారు.ఆ పోస్టర్ లోనిరీక్షణ దాదాపు ముగిసింది. ఈ సీజన్‌ బిగ్గెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ “మనమే” రీలీజ్ డేట్ ను ఇవాళ సాయంత్రం 5:04 గంటలకు ప్రకటించనున్నట్టు మేకర్స్ తెలిపారు.ప్రస్తుతం ఈ స్పెషల్ఈ అప్డేట్ వైరల్ అవుతుంది.