Sharwanand, Krithi Shetty’s New Movie Title is Manamey: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. శర్వా చివరగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ పెద్దగా ఆడలేదు. అంతకుముందు ఆడవాళ్లు మీకు జోహార్లు, మహా సముద్రం కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో మంచి హిట్ కోసం చూస్తున్న శర్వా.. మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ఒకటి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నేడు శర్వానంద్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసింది.
శర్వానంద్ నటిస్తున్న 35వ సినిమాకు ‘మనమే’ అని టైటిల్‌ని లాక్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా రిలీజ్ చేశారు. పోస్టర్‌లో పెయింటింగ్ రోలర్ పట్టుకొని శర్వానంద్ ఉండగా.. పక్కనే ఓ చిన్నబ్బాయి కనిపిస్తున్నారు. చిన్న పిల్లడు ప్రపంచాన్ని గమనిస్తుండగా.. శర్వా అతని వైపు చూస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో లండన్ బ్రిడ్జ్, థేమ్స్ నదిని కూడా చూడవచ్చు. దాంతో ఈ సినిమా మంచి క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నట్టుగా అర్ధం అవుతుంది. ఇక టీజర్ చివరలో కృతి శెట్టి కనిపించింది.
ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా.. కృతి ప్రసాద్ మరియు ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ హీషం అబ్దుల్ వాహద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై శర్వానంద్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇక గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, శ్రీకారం లాంటి హిట్స్ శర్వానంద్ ఖాతాలో ఉన్నాయి.