Site icon NTV Telugu

Biker Release Date: శర్వా స్పీడ్ మామూలుగా లేదుగా! ‘బైకర్’ రిలీజ్ డేట్ లాక్..

Biker Movie

Biker Movie

Biker Release Date: ఇండియన్ సినిమాలో మొదటిసారిగా మోటార్‌క్రాస్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన హై-ఆక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. అభిలాష్ రెడ్డి కంకారా దర్శకత్వంలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, మలవిక నాయర్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 3, 2026న భారీస్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. UV క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్‌ రిలీజ్ అయ్యి సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. ఇక రేపు ఈ చిత్రంలో ‘బుల్లెట్ సునీల్’ అనే పాత్రను పరిచయం చేయబోతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఫిబ్రవరి 4న ఉదయం 11.07 గంటలకు ఈ మూవీ నుంచి బుల్లెట్ సునీల్ గ్లింప్స్‌ను రివీల్ చేయబోతున్నట్లు అఫిషియల్‌గా ప్రకటించారు.

READ ALSO: Solid Fuel Ducted Ramjet: SFDR టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించిన DRDO..(వీడియో)

బైక్ రేసింగ్‌పై విపరీతమైన ఇష్టం ఉన్న ఒక యువకుడి జీవితం గురించి, ఆ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న పోటీలు, సవాళ్లు, ప్రమాదాల మధ్య ఎలా ముందుకు దూసుకెళ్తాడో అనే కథాంశం చుట్టూ రూపుదిద్దుకున్న చిత్రంగా బైకర్ రెడీ అవుతున్నట్లు సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం అవుతుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కుల్కర్ణి వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ 6, 2025న విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఆ టైంలో వాయిదా పడింది. ఇప్పుడు 3D, 4DX ఫార్మాట్లలో సమ్మర్ సీజన్‌లో భారీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. శర్వానంద్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా ప్రేమికులకు ఇది గ్రాండ్ ట్రీట్ అవుతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

READ ALSO: Dhurandhar 2: అడివి శేష్ వర్సెస్ రణ్‌వీర్ సింగ్.. డెకాయిట్ రిలీజ్ డేట్ మారబోతుందా?

Exit mobile version