YS Raja Reddy: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ముద్దుల తనయుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ప్రియ అట్లూరితో రాజారెడ్డి వివాహం నేడు ఘనంగా జరిగింది. వైయస్ రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న ఉమైద్ భవన్ లో ఘనంగా జరిగాయి.. మూడురోజులుగా వీరి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఈనెల 16 నుండి 18 వరకు నిర్వహించనున్న వివాహ వేడుకలలో భాగంగా 16వ తేదీ సంగీత్ మరియు మెహందీ కార్యక్రమం ఉంటుంది. 17వ తేదీన సాయంత్రం ఐదున్నర గంటలకు వైయస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియలు బంధుమిత్రుల సాక్షిగా వివాహవేడుకలో ఒకటి అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
పెళ్లి ఫోటోలు బయటకు రాలేదు కానీ, హల్దీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో నూతన వధూవరులు ఉండగా.. మిగిలినవారందరూ పసుపు దుస్తుల్లో కనిపించారు. రాజారెడ్డి, ప్రియ ల ఇరు కుటుంబాలు ఈ ఫోటోలలో అందంగా కనిపించారు. షర్మిల, ఆమె భర్త అనిల్, కూతురు అంజలి.. తల్లి విజయమ్మ.. రాజారెడ్డి పక్కన ఉండగా.. ప్రియా తల్లిదండ్రులు, తమ్ముడు ఇంకోపక్క నిలబడి ఉన్న ఫోటో ఆకట్టుకుంటుంది. ఇక ఈ పెళ్ళికి సీఎం జగన్ హాజరు కాలేకపోయారు. అయితే కొన్ని పనులు ఉండడం వలన జగన్ రాలేకపోయినట్లు సమాచారం అందుతుంది. నూతన వధూవరులు ఇంటికి తిరిగి వచ్చాకా.. జగన్ స్వయంగా వారిని కలిసి ఆశీర్వాదాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
