Site icon NTV Telugu

Sharma and Ambani: క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఓటీటీలో రానున్న ‘శర్మ అండ్ అంబానీ’..!

9

9

ఈ మధ్య టాలీవుడ్ లో కామెడీ ఎంటర్టైనర్లకు క్రైమ్ జానర్ తోడై కొన్ని సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇకపోతే తాజాగా.. ఇదే కోవలో ఇప్పుడు ‘శర్మ అండ్ అంబానీ’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. కాకపోతే ఇది ఓటీటీలో రాబోతుంది. ఇక ఈ సినిమాలో భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేరాఫ్ కంచరపాలెం కేశవ కర్రీ కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది.

Also Read: Tata Madhu: తన స్వార్థం కోసం నియోజవర్గ ప్రజలను అవహేళన చేశాడు.. తెల్లం వెంకట్రావుపై కీలక వ్యాఖ్యలు

సినిమా సంబంధించి చూస్తే.. ఏప్రిల్ 11వ తేదీ నుంచి అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న ఈటీవీ విన్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘మనమే రాజా అనే పాట’ ఆదిత్య మ్యూజిక్ ఛానల్ లో ప్రమోషన్స్ లో భాగంగా వన్ మిలియన్ వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక తాజాగా మూవీ మేకర్స్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఇక ట్రైలర్ ను పరిశీలిస్తే.. శర్మతో పాటు అంబానీల జీవితాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు దర్శకుడు. శర్మ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్.. అయితే అతని స్నేహితుడు అంబానీ మాత్రం షూ క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇకపోతే సినిమాలో భాగంగా అనుకోకుండా ఒక గ్యాంగ్ కి సంబంధించిన డైమండ్స్ మిస్ అవ్వడంతో వీరి జీవితాలు తారుమారు అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఇలా ఉండగా.. కోర్టు సన్నివేశంలో ధన్య బాలకృష్ణ వాదిస్తున్న తీరు కాస్త ఆసక్తికరంగా ఉంది.

Also Read: Jayashankar Bhupalpally: స్వగ్రామానికి మావోయిస్టు అన్నె సంతోష్ మృతదేహం.. గ్రామంలో విషాదఛాయలు

సినిమాలో శర్మ, అంబానీ వారి జీవితాల్లో జరిగిన అనుకోని పరిస్థితులు వారిని ఎలాంటి పరిస్థితులకు దారి తీసాయి అనేవి ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ ట్రైలర్.. సినిమా మీద ఆసక్తి పెంచేసిందని చెప్పాలి. కార్తీక్ సాయి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. కార్తీక్ సాయి పల్ల, భరత్ తిప్పిరెడ్డిలు నిర్మిస్తున్నారు. ఇక స్క్రిప్ట్ ని భరత్ తిప్పిరెడ్డి తో కలిసి అనిల్ సిద్ధం చేసారు.

Exit mobile version