NTV Telugu Site icon

Shark Attack :బిడ్డ కళ్ల ముందే తల్లిపై దాడి చేసిన షార్క్..బీచ్ క్లోజ్…

Mexico (2)

Mexico (2)

పుట్టిన వాడు గిట్టక తప్పదు..మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు.. మనవాళ్ల కళ్ళముందే ప్రాణం పోతే ఆ భాధ వర్ణణాతీతం.. అలాంటి ఘటనే ఇప్పుడు మెక్సిలో వెలుగు చూసింది.. కుమార్తె కళ్ల ముందే తల్లిపై షార్క్‌ దాడి చేసింది. ఆమె కాలును కొరికి తినేసింది. ఈ సంఘటనలో ఆ మహిళ మరణించింది. మెక్సికోలోని మెలాక్‌ బీచ్‌లో ఈ సంఘటన జరిగింది.. ఈ ఘటన శనివారం జరిగింది..

వివరాల్లోకి వెళితే.. మెక్సిలో ఈ అమానుష ఘటన వెలుగు చూసింది.. 26 ఏళ్ల మరియా ఫెర్నాండెజ్ మార్టినెజ్ జిమెనెజ్ అనే మహిళ తన కుమార్తెతో కలిసి బీచ్‌లో ఈత కొట్టింది. ఇంతలో ఒక షార్క్‌ ఆమెపై దాడి చేసింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఆ మహిళ వెంటనే కూతురైన చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించింది. నీళ్లల్లో నుంచి ఒడ్డుకు కూతురుని నెట్టింది.. వేగంగా వచ్చిన షార్క్ ఆమె కాలును కోరికింది.. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అతికష్టం మీద బీచ్‌ ఒడ్డుకు చేరుకుంది. అయితే ఆ మహిళకు ఒక కాలు తెగడం చూసి అక్కడున్న వారు షాక్‌ అయ్యారు. ఎమర్జెన్సీ బృందం వైద్య సేవలందించినప్పటికీ ఫలితం లేకపోయింది.

తీవ్ర రక్తస్రావంతో ఆమె చనిపోయింది. మరోవైపు ఈ విషాద సంఘటనపై బీచ్‌ అధికారులు స్పందించారు. బీచ్‌లోకి వెళ్లవద్దని సందర్శకులు, స్థానికులను హెచ్చరించారు.. బీచ్‌లో జరుగనున్న స్విమ్మింగ్‌ పోటీలను నిలిపివేశారు. అలాగే షార్క్‌ దాడి జరిగిన మెలాక్‌ బీచ్‌తోపాటు సమీపంలోని ఇతర బీచ్‌లను కూడా అధికారులు మూసివేశారు.. ఎవరు బీచ్ కు వెళ్లోద్దని అధికారులు చెబుతున్నారు.. ఒకవేళ ఎవరైనా వెళితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు..