Shark Attack :బిడ్డ కళ్ల ముందే తల్లిపై దాడి చేసిన షార్క్..బీచ్ క్లోజ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుట్టిన వాడు గిట్టక తప్పదు..మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు.. మనవాళ్ల కళ్ళముందే ప్రాణం పోతే ఆ భాధ వర్ణణాతీతం.. అలాంటి ఘటనే ఇప్పుడు మెక్సిలో వెలుగు చూసింది.. కుమార్తె కళ్ల ముందే తల్లిపై షార్క్ దాడి చేసింది. ఆమె కాలును కొరికి తినేసింది. ఈ సంఘటనలో ఆ మహిళ మరణించింది. మెక్సికోలోని మెలాక్ బీచ్‌లో ఈ సంఘటన జరిగింది.. ఈ ఘటన శనివారం జరిగింది..
వివరాల్లోకి వెళితే.. మెక్సిలో ఈ అమానుష ఘటన వెలుగు చూసింది.. 26 ఏళ్ల మరియా ఫెర్నాండెజ్ మార్టినెజ్ జిమెనెజ్ అనే మహిళ తన కుమార్తెతో కలిసి బీచ్‌లో ఈత కొట్టింది. ఇంతలో ఒక షార్క్ ఆమెపై దాడి చేసింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఆ మహిళ వెంటనే కూతురైన చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించింది. నీళ్లల్లో నుంచి ఒడ్డుకు కూతురుని నెట్టింది.. వేగంగా వచ్చిన షార్క్ ఆమె కాలును కోరికింది.. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అతికష్టం మీద బీచ్ ఒడ్డుకు చేరుకుంది. అయితే ఆ మహిళకు ఒక కాలు తెగడం చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు. ఎమర్జెన్సీ బృందం వైద్య సేవలందించినప్పటికీ ఫలితం లేకపోయింది.
Also Read
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
తీవ్ర రక్తస్రావంతో ఆమె చనిపోయింది. మరోవైపు ఈ విషాద సంఘటనపై బీచ్ అధికారులు స్పందించారు. బీచ్‌లోకి వెళ్లవద్దని సందర్శకులు, స్థానికులను హెచ్చరించారు.. బీచ్‌లో జరుగనున్న స్విమ్మింగ్ పోటీలను నిలిపివేశారు. అలాగే షార్క్ దాడి జరిగిన మెలాక్ బీచ్‌తోపాటు సమీపంలోని ఇతర బీచ్‌లను కూడా అధికారులు మూసివేశారు.. ఎవరు బీచ్ కు వెళ్లోద్దని అధికారులు చెబుతున్నారు.. ఒకవేళ ఎవరైనా వెళితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు..
తాజావార్తలు
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!