Site icon NTV Telugu

ShareChat : షేర్‌చాట్‎లో ఉద్యోగాల కోత.. మూతపడనున్న స్పోర్ట్స్ యాప్‌

Jeet11

Jeet11

ShareChat : ఉద్యోగులను తొలగిస్తున్న సోషల్ మీడియా కంపెనీల జాబితాలో షేర్‌చాట్ కూడా చేరింది. ఫాంటసీ స్పోర్ట్స్ యాప్ నేటి నుంచి Jeet11ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో 5 శాతం మంది ఉద్యోగులను తొలగించనుంది. అంటే దాదాపు 100 మంది ఉద్యోగాలు కోల్పోతారు. ‘భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సోషల్ మీడియా కంపెనీగా మేము ఎల్లప్పుడూ మా ప్రణాళికలను తూకం వేస్తాం. మేము మా లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన మార్పులు చేస్తాం. అందులో భాగంగానే Jeet11 యాప్ సేవలను నిలిపివేస్తున్నాం. మరికొన్ని విభాగాల్లో తీసుకుంటున్నాం. మరికొందరిని వారి ఉద్యోగాల నుండి తొలగిస్తున్నాం. Jeet11 యాప్ షట్‌డౌన్ కారణంగా మా ఉద్యోగులలో 5 శాతం కంటే తక్కువ మంది ప్రభావితమవుతారు’ అని షేర్‌చాట్ ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: Shraddha Case: నార్కో టెస్టులో శ్రద్ధను ఎలా చంపాడో తెలిపిన ఆఫ్తాబ్

బెంగుళూరుకు చెందిన అంకుష్ సచ్‌దేవా, భాను ప్రతాప్ సింగ్, ఫరీద్ హసన్ 2015లో షేర్‌చాట్‌ని ప్రారంభించారు. షేర్‌చాట్ మోజ్, మోజ్ లైట్ ప్లస్ వంటి అప్లికేషన్‌లను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కంపెనీలో 2,300 మంది పనిచేస్తున్నారు. ఐదు నెలల క్రితం గూగుల్, టైమ్స్ గ్రూప్ మరియు టెమాసెక్ వంటి కంపెనీలు షేర్‌చాట్‌లో 230 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చాయి. ఈ నేప‌థ్యంలో షేర్‌చాట్ ఉద్యోగుల‌ను తొల‌గించే నిర్ణయం అంద‌ర్నీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి స్టార్టప్ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఇప్పటి వరకు 16 వేల మందిని ఇళ్లకు పంపించారు.

Exit mobile version