NTV Telugu Site icon

Share Wale Baba: ఈయన అవతారం చూసి మోసపోకండి.. రూ.100 కోట్ల షేర్లకు అధిపతి

New Project (10)

New Project (10)

Share Wale Baba: మామూలుగా ఒక కోటిశ్వరులు అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది లగ్జరీ లైఫ్. ఇంధ్రభవనం లాంటి ఇళ్లు, ఖరీదైన కార్లు ఉంటాయని ఊహించుకుంటాం. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీ ఊహలన్నీ తారుమారు అవడం ఖాయం. చాలా మామూలుగా కనిపించే ఓ వృద్ధుడు తనకు కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని చెబుతున్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను రాజీవ్ మెహతా అనే వినియోగదారు సోషల్ మీడియా X లో పోస్ట్ చేశారు. దీనిని మిలియన్ల మంది ప్రజలు వీక్షించారు. ఈ వీడియో చూస్తే.. అందులో కనిపిస్తున్న పెద్దాయనకు ప్రస్తుతం రూ.100 కోట్లకు పైగా షేర్లు ఉన్నాయి. రూ. 80 కోట్ల విలువైన ఎల్‌అండ్‌టీ షేర్లు, రూ. 21 కోట్ల విలువైన అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు, రూ. కోటి విలువైన కర్ణాటక బ్యాంక్ షేర్లను కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ విధంగా చూస్తే ఆయనకు రూ.102 కోట్ల షేర్లు ఉన్నాయి.

Read Also:MS Swaminathan: హరిత విప్లవ పితామహుడు ఎం ఎస్ స్వామినాధన్ కన్నుమూత

Read Also:Video: ఫోన్ ఎంతపని చేసింది.. కాల్ మాట్లాడుతూ ట్రైన్ ను ఫ్లాట్ ఫాం పైకి ఎక్కించాడు

ఈ లెక్కన ఈయన కూడా కోటీశ్వరుడు
అయితే ఈ లెక్కను ప్రజలు అంగీకరించడం లేదు. పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ క్యాపిటల్ మైండ్ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన దీపక్ షెనాయ్ తన లెక్కలను వివరించారు. వృద్ధుడికి ఎల్‌అండ్‌టీలో 27 వేల షేర్లు ఉన్నాయని, దీని విలువ దాదాపు రూ.8 కోట్లు ఉంటుందని ఆయన చెప్పారు. అదే విధంగా అతని వద్ద ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ షేర్ల విలువ దాదాపు రూ.3.2 కోట్లు కాగా, కర్ణాటక బ్యాంక్ షేర్ల విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఈ లెక్కన మొత్తం షేర్ల విలువ రూ.11 కోట్లకు పైగానే వస్తుంది. వీడియోలో చేస్తున్న వాదనలు నిజమైతే అందులో కనిపిస్తున్న వృద్ధుడి నికర విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తుంది. సోషల్ మీడియాలో వినియోగదారులు అతన్ని షేర్‌వాలే బాబా అని సంబోధిస్తున్నారు. ఒక వినియోగదారు డివిడెండ్ల నుండి సంపాదించే లెక్కలను కూడా వివరించారు. వినియోగదారుడు షేర్ల సంఖ్యను బట్టి లెక్కించి, కేవలం డివిడెండ్‌తో సులభంగా లక్షలు ఆర్జిస్తున్నట్లు చెప్పాడు.