Site icon NTV Telugu

Sharathulu Varthisthai : షరతులు వర్తిస్తాయి మూవీకి క్లీన్ యు సర్టిఫికెట్..

Whatsapp Image 2024 03 14 At 9.33.31 Am

Whatsapp Image 2024 03 14 At 9.33.31 Am

30 వెడ్స్ 21 యూట్యూబ్ సిరీస్‌తో ఊహించని క్రేజ్ తెచ్చుకున్న చైతన్య రావు హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. తాజాగా చైతన్య రావు హీరోగా నటించిన మరో కొత్త సినిమా షరతులు వర్తిస్తాయి. ఈ సినిమాలో చైతన్య రావుకు జోడీగా భూమి శెట్టి నటించింది. బిగ్ బాస్ కన్నడ షో ద్వారా పాపులర్ అయిన భూమి శెట్టి ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.షరతులు వర్తిస్తాయి చిత్రాన్ని కుమారస్వామి (అక్షర) దర్శకత్వం వహించారు. ఈ సినిమాను స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై శ్రీలత, నాగార్జున సామల, శారదా, శ్రీష్ కుమార్ గుండా, విజయ మరియి డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. ఇక సినిమాలో చైతన్య రావు, భూమి శెట్టితోపాటు నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్ మరియు సుజాత తదితరులు  నటిస్తున్నారు.షరతులు వర్తిస్తాయి ఈ నెల 15న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.

ఇటీవలే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. షరతులు వర్తిస్తాయి సినిమాకు సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేశారు.ఈ సందర్భంగా మానవీయ విలువలు ఉన్న ఒక మంచి సినిమా రూపొందించారంటూ దర్శకుడు కుమారస్వామిపై సెన్సార్ బోర్డ్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. అయితే సినిమా డైరెక్టర్ కుమారస్వామి కూడా సెన్సార్ బోర్డ్ సభ్యుల్లో ఒకరు కావడం విశేషం..ఈ విషయం తెలియకుండా సినిమా వీక్షించిన బోర్డ్ మెంబర్స్ తమ సభ్యుడు ఇంత గొప్ప సినిమా తీయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.సెన్సార్ బృందం స్పందిస్తూ.. “తెలంగాణ సినిమా అనగానే కొన్నాళ్లుగా కనిపిస్తోన్న విపరీతమైన మద్యం సన్నివేశాలు, నిర్లక్ష్యపు ధోరణులకు భిన్నంగా షరతులు వర్తిస్తాయి మూవీ ఉంది. ఇందులో ఒక గొప్ప మానవీయ విలువలు చూపించారు. మానవ సంబంధాలతో నిండి ఉన్న ఇలాంటి చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి. తెలంగాణ నేపథ్యంలోనే కనిపించినా ఒక యూనిక్ కంటెంట్ ఈ చిత్రంలో ఉంది” అని వారు పేర్కొన్నారు.

Exit mobile version