Sharathulu Varthisthai : షరతులు వర్తిస్తాయి మూవీకి క్లీన్ యు సర్టిఫికెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
30 వెడ్స్ 21 యూట్యూబ్ సిరీస్‌తో ఊహించని క్రేజ్ తెచ్చుకున్న చైతన్య రావు హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. తాజాగా చైతన్య రావు హీరోగా నటించిన మరో కొత్త సినిమా షరతులు వర్తిస్తాయి. ఈ సినిమాలో చైతన్య రావుకు జోడీగా భూమి శెట్టి నటించింది. బిగ్ బాస్ కన్నడ షో ద్వారా పాపులర్ అయిన భూమి శెట్టి ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.షరతులు వర్తిస్తాయి చిత్రాన్ని కుమారస్వామి (అక్షర) దర్శకత్వం వహించారు. ఈ సినిమాను స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై శ్రీలత, నాగార్జున సామల, శారదా, శ్రీష్ కుమార్ గుండా, విజయ మరియి డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. ఇక సినిమాలో చైతన్య రావు, భూమి శెట్టితోపాటు నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్ మరియు సుజాత తదితరులు నటిస్తున్నారు.షరతులు వర్తిస్తాయి ఈ నెల 15న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.
ఇటీవలే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. షరతులు వర్తిస్తాయి సినిమాకు సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేశారు.ఈ సందర్భంగా మానవీయ విలువలు ఉన్న ఒక మంచి సినిమా రూపొందించారంటూ దర్శకుడు కుమారస్వామిపై సెన్సార్ బోర్డ్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. అయితే సినిమా డైరెక్టర్ కుమారస్వామి కూడా సెన్సార్ బోర్డ్ సభ్యుల్లో ఒకరు కావడం విశేషం..ఈ విషయం తెలియకుండా సినిమా వీక్షించిన బోర్డ్ మెంబర్స్ తమ సభ్యుడు ఇంత గొప్ప సినిమా తీయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.సెన్సార్ బృందం స్పందిస్తూ.. “తెలంగాణ సినిమా అనగానే కొన్నాళ్లుగా కనిపిస్తోన్న విపరీతమైన మద్యం సన్నివేశాలు, నిర్లక్ష్యపు ధోరణులకు భిన్నంగా షరతులు వర్తిస్తాయి మూవీ ఉంది. ఇందులో ఒక గొప్ప మానవీయ విలువలు చూపించారు. మానవ సంబంధాలతో నిండి ఉన్న ఇలాంటి చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి. తెలంగాణ నేపథ్యంలోనే కనిపించినా ఒక యూనిక్ కంటెంట్ ఈ చిత్రంలో ఉంది” అని వారు పేర్కొన్నారు.
Also Read
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్‌పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!