NTV Telugu Site icon

Sharat Marar : ది ఘోస్ట్ మూవీ తో మేము సేఫ్ అయ్యాము.. కానీ నాగార్జున లాస్ అయ్యారు..

Whatsapp Image 2023 12 06 At 11.42.53 Am

Whatsapp Image 2023 12 06 At 11.42.53 Am

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నటించిన మూవీ ది ఘోస్ట్..ఈమూవీ గత ఏడాది అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత శరత్ మరార్ దాదాపు నలభై కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎంతో హైప్ తో విడుదల అయిన ది ఘోస్ట్ మూవీ డిజాస్టర్‌గా మిగిలింది..ఈ మూవీ నిర్మాతల కు దాదాపు పదిహేను కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.ఇదిలా ఉంటే తాజాగా ది ఘోస్ట్ మూవీ రిజల్ట్‌పై దూత వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో నిర్మాత శరత్ మరార్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు.మూవీ రిజల్ట్‌ తో పాటు నాగార్జున రెమ్యునరేషన్‌పై కూడా శరత్‌మరార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఘోస్ట్ మూవీ కి ముందు గా అనుకున్నదానికంటే బడ్జెట్ బాగా పెరగడంతో కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచిందని శరత్ మరార్ అన్నారు.ఈ సినిమా ఫ్లాప్ కావడం తో నాగార్జున రెమ్యునరేషన్ తీసుకోలేదని ఆయన తెలిపారు. అయితే ఈ సినిమా తో మేము సేఫ్ అయ్యామని, కానీ నాగార్జున మాత్రం రెమ్యునరేషన్ తీసుకోకుండా లాసయ్యారని శరత్ మరార్ చెప్పారు.ది ఘోస్ట్ మూవీలో నాగార్జున సరసన సోనాల్ చౌహన్ హీరోయిన్‌గా నటించింది.ది ఘోస్ట్ తర్వాత సినిమాలకు ఏడాది పాటు విరామం తీసుకున్న నాగార్జున ప్రస్తుతం నా సామిరంగ అనే సినిమా లో నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి లో ఈ మూవీ రిలీజ్ కానుంది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అల్లరి నరేష్‌ మరియు రాజ్‌తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా లో నాగార్జున సరసన యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా లో ఆషికా రంగనాథ్ వరలక్ష్మి అనే పాత్రలో నటిస్తుంది..తాజాగా వరలక్ష్మి పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.