Site icon NTV Telugu

Shanmukh Jaswanth : వీలు చైర్ లో దారుణమైన స్థితిలో కనిపించిన షణ్ముఖ్..?

Shanmukh Bigg Boss Wheelchair

Shanmukh Bigg Boss Wheelchair

యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒక యూట్యూబ్ స్టార్ గా ఎంత పేరు సంపాదించుకున్నాడో.. పర్సనల్ విషయంలో అంత హాట్ టాపిక్ గా మారాడు.. దీప్తి సునైన బిగ్ బాస్ లో పాల్గొన్నప్పుడు షణ్ముఖ్ గురించి టాపిక్ తీసిందో అప్పటి నుంచి షణ్ముఖ్ అందరి దృష్టిలో పడ్డాడు. ఇక ఇతడు యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ మరింత పరిచయాన్ని పెంచుకున్నాడు.మొదట్లో దీప్తి సునైనతో కలిసి చాలా వీడియోస్ చేశాడు. అతి తక్కువ సమయంలో యూట్యూబ్ స్టార్ గా మారాడు. ఇక అదే సమయంలో దీప్తి సునైనతో ప్రేమాయణం నడిపాడు..

ఇక దీప్తి ఫ్యాన్స్ కూడా షన్ను కు ఫ్యాన్స్ గా మారారు. ఇక ఇద్దరు కలిసి బుల్లితెరపై పలు షోలల్లో పాల్గొని బాగా సందడి చేశారు. ఆ తర్వాత షన్నుకు బిగ్ బాస్ లో అవకాశం రావడంతో మరో కంటెస్టెంట్ సిరి తో ఇతడు కాస్త మితిమీరి ప్రవర్తించడంతో దీప్తి అతనికి బ్రేకప్ చెప్పేసింది.. ఇప్పుడు ఎవరిలైఫ్ వాళ్ళు బిజీగా గడుపుతున్నారు.. ఇక షన్ను కూడా దీప్తిని వదులుకోలేకపోయాడు. ఆ తర్వాత తనకు కూడా ఒంటరిగా ఉండటం అలవాటయింది. ఇక ఎప్పటిలాగే కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. మంచి సక్సెస్ లు అందుకుంటూ ఒక స్టార్ హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు..

ఇక షన్ను కూడా దీప్తిని వదులుకోలేకపోయాడు. ఆ తర్వాత తనకు కూడా ఒంటరిగా ఉండటం అలవాటయింది. ఇక ఎప్పటిలాగే కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. మంచి మంచి సక్సెస్ లు అందుకుంటూ ఒక స్టార్ హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడు తన వీడియోస్,ఫొటోస్ పంచుకుంటూ ఉంటాడు. అయితే తాజాగా ఇన్‌స్టాలో ఒక స్టోరీ పంచుకున్నాడు. అందులో తను వీల్ చైర్‌లో కూర్చొని కనిపించాడు. అది చూసిన అభిమానులు మిస్టర్ షన్ను ఏమైంది? అంటూ కంగారుగా అడుతున్నారు. కానీ, అది తన తాతయ్య కోసం తీసుకున్న విల్ చైర్ అని, సరదాగా కూర్చున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Exit mobile version