Site icon NTV Telugu

Vikarabad: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు భీభత్సం.. కారును ఢీ కొట్టిన బస్సు

Accident

Accident

Vikarabad: శంకర్‌పల్లి సమీపంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు కారణంగా భారీ ప్రమాదం సంభవించింది. వికారాబాద్ నుంచి శంకర్‌పల్లి వైపు వెళ్తున్న బస్సు, మహాలింగపూరం వద్ద అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కారు మొత్తానికి వ్యాప్తించాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై, కారులో ఉన్న డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసి ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించారు. బస్సులో ఉన్న ప్రయాణీకులు ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమైనట్టు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై శంకర్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు, బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు.

READ MORE: Pakistan: “ఇమ్రాన్ ఖాన్‌కి ఏమైంది..?” పాకిస్థాన్ పార్లమెంట్‌లో గందరగోళం..

Exit mobile version