NTV Telugu Site icon

Game Changer : అదిరిపోయే స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్న శంకర్.. మాస్ బీట్స్ సిద్ధం అవుతున్న తమన్..?

Ramcharan

Ramcharan

Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో రాంచరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు.తండ్రి ,కొడుకుగా రాంచరణ్ నట విశ్వరూపం చూపించనున్నాడని సమాచారం.అయితే ఈ సినిమాలో తండ్రి పాత్ర అయిన “అప్పన్న” రోల్ లో రాంచరణ్ పవర్ఫుల్ నాయకుడిగా కనిపించనున్నాడని సమాచారం.అలాగే కొడుకు పాత్ర అయిన “రామ్ నందన్ ” పాత్రలో చరణ్ పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు సమాచారం.

Read Also :Kalki 2898 AD : ఎక్కడ చూసిన ‘కల్కి’ మయమే..ఈ సారి మరింత భారీగా..?

ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది.దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బాగా బిజీ గా ఉండటంతో “గేమ్ ఛేంజర్” మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో దర్శకుడు శంకర్ ఓ భారీ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఈ సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాస్ బీట్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.ఈ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలువనుందని సమాచారం

Show comments