NTV Telugu Site icon

Shankar : తన పూర్తి ఫోకస్ గేమ్ చేంజర్ సినిమాపై పెట్టనున్న దర్శకుడు శంకర్..

Whatsapp Image 2023 06 29 At 3.32.01 Pm

Whatsapp Image 2023 06 29 At 3.32.01 Pm

దర్శకుడు శంకర్ ఒకే సమయంలో రెండు సినిమాలను తెరకెక్కిస్తూ ఎంతో బిజీగా వున్నాడు. ఇది వరకు ఎప్పుడూ కూడా దర్శకుడు శంకర్ ఇలాంటి సాహసం చేయలేదు. తాను అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఒక సినిమాను మొదలు పెడితే మంచి ఔట్ పుట్ వచ్చే వరకు దాదాపు రెండు సంవత్సరాల సమయంతో ఒక సినిమాను తెరకెక్కించేవాడు. అలా ఇండియన్ సినిమా కు సీక్వల్ గా ఇండియన్ 2 సినిమాను కమల్ హాసన్ తో మొదలు పెట్టాడు శంకర్. కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్ధం అయింది.కానీ అనుకోని కారణాలతో ఈ సినిమాను మధ్యలోనే ఆపి వేయవలసి వచ్చింది.ఈ గ్యాప్ లో దర్శకుడు శంకర్ రాంచరణ్ తో గేమ్ చేంజర్ సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నాడు.అలా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. కానీ లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయమని శంకర్ కు కోర్ట్ ద్వారా నోటీసులు పంపింది. కోర్ట్ కూడా ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయవలసిందిగా ఆదేశించింది.అదే సమయంలో కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయమని శంకర్ ను కోరినట్లు సమాచారం.దర్శకుడు శంకర్ కమల్ హాసన్ చొరవతో ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసేందుకు ఒప్పుకున్నాడు.

ఇండియన్ 2 సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది….ఈ రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే. దర్శకుడు శంకర్ తన ప్రతీ సినిమాను ఎంతో గ్రాండ్ ఎలిమెంట్స్ తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తాడు. అయితే ఈయన కెరీర్ లో ఎప్పుడూ కూడా ఒక సినిమా పూర్తి అయిన తర్వాతనే మరొక సినిమాను మొదలు పెడతాడు. కానీ ఈసారి మాత్రం రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేయవలసి వచ్చింది.శంకర్ రెండు సినిమాలను షెడ్యూల్స్ గా విభజించి రెండింటిని పార్ల్లెల్ గా తెరకెక్కిస్తున్నాడు.. అయితే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు షూటింగ్ వేగంగా జరుగగా ఈ మధ్య ఆ సినిమా షూటింగ్ కు ఎక్కువ బ్రేక్ ఇచ్చాడు శంకర్. గత కొద్దీ రోజులుగా ఇండియన్ 2 సినిమాతో బాగా బిజీగా ఉన్నాడు శంకర్.ఇండియన్ 2 సినిమాను షూట్ దాదాపు పూర్తి చేసాడు శంకర్.. అందుకే ఇక నుండి శంకర్ రాంచరణ్ సినిమాపైనే పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్లు సమాచారం.

Show comments