NTV Telugu Site icon

Shankar : ఇండియన్ 2 సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేయబోతున్న దర్శకుడు శంకర్..?

Whatsapp Image 2023 07 17 At 10.37.55 Pm

Whatsapp Image 2023 07 17 At 10.37.55 Pm

తమిళ స్టార్ దర్శకుడు శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్2 సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ మొదలై కొంత భాగం పూర్తి అయిన తర్వాత అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ నిలిపివేయడం జరిగింది.వెంటనే శంకర్ ఈ సినిమా పనులను ఆపేసి గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమాను మొదలుపెట్టడం జరిగింది.. అయితే ఆ తర్వాత రోజుల్లో ఇండియన్ 2 సినిమాకు వున్న అడ్డంకి తొలగిపోవడంతో శంకర్ ఇండియన్2 సినిమాను షూటింగ్ మళ్ళీ రీ స్టార్ట్ చేసారు.అయితే ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న కమెడియన్ వివేక్ మరియు మలయాళ నటుడు నెడుముడి వేణు కొన్ని సన్నివేశాల షూట్ పూర్తైన తర్వాత మృతి చెందటం జరిగింది.

ఆ సన్నివేశాలను ఇప్పుడు రీషూట్ చేయాలంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది.అయితే టెక్నాలజీని వాడుకునే విషయంలో శంకర్ ఎప్పుడూ ముందు వుంటారు.అయితే హాలీవుడ్ టెక్నాలజీని ఉపయోగించి వివేక్ మరియు నెడుముడి వేణు సీన్లను చూపించనున్నారని తెలుస్తుంది.గతంలో ఎప్పుడూ కూడా చేయని ప్రయోగాలను ఈ సినిమా కోసం శంకర్ చేస్తున్నట్లు సమాచారం.కమల్ హాసన్ ను గ్రాఫిక్స్ సహాయంతో ఈ సినిమాలో ఎంతో యంగ్ గా చూపించనున్నారని ప్రచారం జరుగుతుంది.శంకర్ చేస్తున్న ఈ ప్రయోగాలు సినిమాకు ప్లస్ అవుతాయో లేదో చూడాలి.ఈ సినిమాకు డైరెక్టర్ శంకర్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం శంకర్ తెరకెక్కించిన ఐ మరియు 2.o సినిమాలు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి. ఇండియన్ 2 సినిమాతో భారీ కలెక్షన్స్ సాధించాలని చూస్తున్నట్లు సమాచారం.అలాగే రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ సినిమా కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్మారు నిర్మాత దిల్ రాజు. మరీ ఈ రెండు సినిమాలతో శంకర్ మళ్ళీ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.